https://oktelugu.com/

Abhishek Bachchan Aishwarya: అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ ల మధ్య గొడవకు అసలు కారణం అదేనట?

52వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో జయ బచ్చన్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అనే అవార్డును సొంతం చేసుకుంది. అప్పుడు ఐశ్వర్య రాయ్ కూడా ప్రశంసించింది. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య సడన్ గా అనుబంధం మారిపోయిందట.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 11, 2024 / 03:22 PM IST

    Abhishek Bachchan Aishwarya

    Follow us on

    Abhishek Bachchan Aishwarya: గత సంవత్సరం నుంచి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడిపోతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. కొన్ని సంఘటనలు కూడా అదే విధంగా జరగడంతో ఈ వార్తలు మరింత హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా హోలీ పండగ సంబరాల్లో కూడా ఐశ్వర్యరాయ్ కనిపించలేదు అనే విషయం తెలిసిందే. ఇక అభిషేక్, ఐశ్వర్యల మధ్య విబేధాలు రావడానికి జయా బచ్చన్ ముఖ్య కారణం అంటారు. కొన్ని సంవత్సరాల నుంచి అత్తాకోడళ్ల బంధం బాగానే ఉండేదట. కానీ కొన్ని రోజుల నుంచి వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయట.

    52వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో జయ బచ్చన్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అనే అవార్డును సొంతం చేసుకుంది. అప్పుడు ఐశ్వర్య రాయ్ కూడా ప్రశంసించింది. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య సడన్ గా అనుబంధం మారిపోయిందట. ఇద్దరి మధ్య ఉన్న దూరం వల్ల అభిషేక్, ఐశ్వర్యల మధ్య కూడా గొడవలు మొదలు అయ్యాయి అంటున్నారు సన్నిహిత వర్గాలు. ఓ ఫోటోలో అభిషేక్ తన పెళ్లి ఉంగరం ధరించి కనిపించారు. ఆ తర్వాత విడాకుల వార్త వచ్చింది. ఈ వార్తల తదనంతరం ఐశ్వర్య అభిషేక్ తో కనిపించి అభిమానులకు ఊరట ఇచ్చింది.

    మరోసారి రీసెంట్ గా హోలీ వేడుకల్లో మాత్రం ఐశ్వర్య అత్తగారితో కనిపించలేదు. కానీ ఈమె తన భర్త, కుమార్తె, స్నేహితులతో కలిసి హోలీ ని సెలబ్రేట్ చేసుకుంది. దీంతో అత్తాకోడళ్ల మధ్యనే ఈ వివాదం రాజుకుంది అని విమర్శలు వస్తున్నాయి. అత్తగారి పుట్టిన రోజున ఐష్ శుభాకాంక్షలు తెలపలేదు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. రీసెంట్ గా హోలీ సెలబ్రేషన్స్ లో కూడా దగ్గరగా లేరు.

    ఘర్ ఘర్ కీ కహానీ అన్నట్టుగానే బిగ్ బీ ఇంట్లో కూడా అదే కహానీ నడుస్తోంది. కానీ అత్తాకోడళ్ల మధ్య భర్త పాత్ర ఏంటో అర్థం కాక బిగ్ బీ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. మొత్తం మీద రెండు వైపుల సర్దుకుపోతూ మేనేజ్ చేస్తున్నారట అభిషేక్ బచ్చన్. మరి ముందు ముందు ఎలాంటి వార్తలు వినిపిస్తాయో చూడాలి.