Ram Charan: రామ్ చరణ్ చేసిన ఆ ఒక్క పని వల్లే శంకర్ సేఫ్ అయ్యాడా..? లేకపోతే ఏం అయి ఉండేది..?

రామ్ చరణ్ కూడా అదే కాన్సెప్ట్ తో ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే 'త్రిబుల్ ఆర్' సినిమా తర్వాత ఆయన శంకర్ సినిమాలో బిజీగా కొనసాగుతున్నాడు.

Written By: Gopi, Updated On : June 11, 2024 5:25 pm

Ram Charan

Follow us on

Ram Charan: సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎంతటి ఘన కీర్తిని సంపాదించుకున్నాడో అతని కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కూడా అలాంటి ఒక గొప్ప పేరును సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో అందరూ బాగుండాలని కోరుకుంటాడు. చిరంజీవి కూడా ఎదుటి వ్యక్తి కోసం తను ఇబ్బంది పడిన పర్లేదు కానీ అవతల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే కాన్సెప్ట్ లో ఉండేవాడు. అందువల్లే చిరంజీవి ఆ స్థాయికి ఎదిగాడు.

ఇక తన వారసుడైన రామ్ చరణ్ కూడా అదే కాన్సెప్ట్ తో ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘త్రిబుల్ ఆర్’ సినిమా తర్వాత ఆయన శంకర్ సినిమాలో బిజీగా కొనసాగుతున్నాడు. అయితే శంకర్ దీనికంటే ముందే కమలహాసన్ తో ‘ఇండియన్ 2’ అనే సినిమాని స్టార్ట్ చేసి ఒక 20% షూటింగ్ ని కూడా పూర్తి చేశాడు. ఇక ఆ తర్వాత కొన్ని క్లాషెష్ రావడం వల్ల ఆ సినిమాను మధ్యలో ఆపేశారు. ఇక ఎప్పుడైతే కమలహాసన్ విక్రమ్ సినిమా సూపర్ హిట్ అయిందో అప్పటినుంచి కమల్ హాసన్ తో ప్రొడ్యూసర్స్ ఇండియన్ 2 సినిమా మళ్లీ స్టార్ట్ చేయాలని చూశారు. ఇక అందులో భాగంగానే అప్పటికే శంకర్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ ప్రొడ్యూసర్స్ కోర్టుకు వెళ్లి మరి శంకర్ ని ఈ సినిమా చేయాల్సిందిగా కోర్టు నుంచి ఆర్డర్ ను తీసుకువచ్చారు.

ఇక అలాంటి సమయంలో అప్పటికే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా పైన దాదాపు 100 రోజుల డేట్స్ కేటాయించాడు. అయినప్పటికీ శంకర్ క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాడు కదా అనే ఉద్దేశ్యంతోనే శంకర్ తో ఇండియన్ 2 సినిమా చేయమని రామ్ చరణ్ కూడా చెప్పాడు. ఇక తన డేట్స్ వేస్ట్ అవుతాయని తెలిసిన కూడా రామ్ చరణ్ అలాంటివి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

ఒక దానివల్లే శంకర్ ఇండియన్ 2 సినిమాని చేసి ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమాని చేస్తున్నాడు. ఒకవేళ రామ్ చరణ్ కనక నా సినిమానే ముందు చేయాలి అని పట్టు పట్టినట్టైతే శంకర్ అటు ఇండియన్ 2 సినిమాని, గేమ్ చేంజర్ సినిమాని రెండింటిలో ఏ సినిమాని కూడా పూర్తి చేసేవాడు కాదు అంటూ చాలామంది మేధావులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక రామ్ చరణ్ గొప్పతనాన్ని తెలియజేస్తూ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లైతే చేస్తున్నారు…