Nagarjuna 100th film: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు ఉంది. మొదటి తరంలో అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీ లో టాప్ హీరోగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. నాగేశ్వరరావు నుంచి అఖిల్ వరకు ప్రతి ఒక్కరు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు నాగేశ్వరరావు వరస సినిమాలను చేస్తూ ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. ఇక తన తర్వాత తన వారసుడిగా నాగార్జునను బరిలోకి దింపాడు. మొత్తానికైతే నాగార్జున సైతం మంచి నటుడిగా ఎదగడమే కాకుండా ఎక్స్పరిమెంట్లు చేసే హీరోగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక నాగార్జున కూడా రీసెంట్ టైంలో హీరోగా చేసిన సినిమాలతో సక్సెస్ ను సాధించలేకపోయాడు. కానీ ఈ ఒక్క సంవత్సరంలోనే కుబేర, కూలీ లాంటి రెండు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా నటించి తన నటన ప్రతిభను మరోసారి వెలికి తీసే ప్రయత్నం చేశాడు…ప్రస్తుతం నాగార్జున తన 100 వ సినిమాని చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టాయి. 100 వ సినిమా అనగానే అదొక మైల్ రాయి గా మిగిలిపోవాలని అందరు అనుకుంటారు. నాగార్జున సైతం ఈ సినిమాని ఎక్స్పెరిమెంటల్ గా తీసుకొని ఒక గుర్తుండిపోయే సినిమాగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తమిళ్ సినిమా డైరెక్టర్ అయిన కార్తీక్ తో తన 100 వ సినిమాని చేస్తున్నట్టుగా నాగార్జున అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ‘డెజావు’ స్క్రీన్ ప్లే తో తెరకెక్కబోతుందట. ఇంతకీ డెజావు అంటే ఏంటంటే మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు దానిని ఇంతకుముందు ఎప్పుడో మనం చూసినట్టుగా ఒక ఫీల్ అయితే కలుగుతోంది…
అలా ఎందుకు కలుగుతోంది అంటే ఇంతకుముందు మనం ఆ ప్రదేశానికి సంబంధించిన ఫోటోలు గాని, వీడియోలు గాని చూసిన లేదంటే మనం వెళుతున్న దారిలో ఆ ప్రదేశం కనిపించినప్పుడు చూసి చూడనట్టుగా వదిలేసిన కూడా అవన్నీ మన బ్రెయిన్ రిసీవ్ చేసుకొని ఆ ప్రదేశం కి వెళ్ళినప్పుడు ఇంతకుముందు ఎప్పుడో మనం ఈ ప్లేస్ కి వచ్చినట్టుగా ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతోంది…
దానివల్ల ఆ ప్రదేశాన్ని చూసినట్టుగా మనకు అనిపిస్తోంది. ఇలాంటి ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో నాగార్జున తన సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి…ఈ స్క్రీన్ ప్లే తో గత రెండు సంవత్సరాల కిందట ‘ఆరంభం’ అనే ఒక చిన్న సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది…
ఆరంభం సినిమాలా కాకుండా నాగార్జున ఇంకొంచెం డీప్ గా వెళ్లి డిజావు స్క్రీన్ ప్లే ను ఇంకా డిఫరెంట్ గా వర్కౌట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో ఇలాంటి సినిమా చేయలేదు. మరి నాగార్జున ఈ సినిమాతో చేస్తున్న ప్రయోగం సక్సెస్ ను సాధిస్తోందా లేదా అనేది తెలియాల్సి ఉంది…