Siddu Jonnalagadda favorite hero: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, నేడు యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్న హీరోలలో ఒకరు సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). కెరీర్ ప్రారంభం లో ఇతను చిన్న చిన్న రోల్స్ తోనే పాపులారిటీ ని సంపాదించాడు. ఆ తర్వాత ‘గుంటూరు టాకీస్’ చిత్రం తో మొట్టమొదటిసారి హీరో గా వెండితెర పై కనిపించాడు. ఆ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది కానీ, హీరో గా అవకాశాలు రావడానికి మళ్లీ చాలా కాలమే పట్టింది. ఆ తర్వాత కూడా క్యారక్టర్ రోల్స్ చేసుకుంటూ వచ్చిన సిద్దుకి కృష్ణా & హిస్ లీల చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన హీరో గా నటించిన ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలు కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.
ఈ రెండు సినిమాలు సిద్దు రేంజ్ ని యూత్ ఆడియన్స్ లో ఎక్కడికో తీసుకెళ్లి పెట్టింది. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన నుండి విడుదలైన ‘జాక్’ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అవ్వగా, నేడు ఆయన నుండి ‘తెలుసు కదా’ అనే సినిమా విడుదలైంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది. అంటే కొంతమంది పర్లేదు బాగుంది అని అంటున్నారు, మరికొంతమంది మాత్రం బాగాలేదని అంటున్నారు. ఈ దీపావళి వరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత A సెంటర్స్ లో మంచి రన్ ని సొంతం చేసుకోవచ్చు కానీ, మాస్ సెంటర్స్ లో మాత్రం వీకెండ్ తర్వాత క్లోజింగ్ కలెక్షన్స్ వేసుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే విడుదలకు ముందు హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రొమోషన్స్ లో ఏ రేంజ్ లో పాల్గొన్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం.
సోషల్ మీడియా లో కూడా ప్రొమోషన్స్ దుమ్ము లేపేసాడు. నిన్న ట్విట్టర్ లోని అభిమానులతో ఆయన ఇంటరాక్షన్ జరిపాడు. ఒక నెటిజెన్ మీ అభిమాన హీరో ఎవరు అనే ప్రశ్న అడగ్గా, దానికి సిద్దు జొన్నలగడ్డ రణబీర్ కపూర్ అంటూ క్షణం కూడా ఆలోచించకుండా సమాధానం చెప్పాడు. ఇన్ని రోజులు సిద్దు ని ఆడియన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని అనుకున్నారు. ఎందుకంటే ఆయనకు సిద్దు బాగా క్లోజ్ కాబట్టి. అంతే కాకుండా రీసెంట్ గా సిద్దు ఓజీ సినిమా గురించి ఎన్నో ట్వీట్స్ వేసాడు, కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని కూడా అనుకోవచ్చు, వీళ్లిద్దరి పేర్లు కాకుండా, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ పేరు చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.