Bigg Boss 9 Dammu Sreeja: గత వారం హౌస్(Bigg Boss 9 Telugu) లోకి ఫైర్ స్ట్రోమ్ లాగా అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్స్ తో శ్రీజా దమ్ము(Dhammu Srija) ని ఎలిమినేట్ చేయించడం పెద్ద సంచలనానికి దారి తీసింది. బిగ్ బాస్ రియాలిటీ షోని అమితంగా ఇష్టపడుతూ చూసే ఆడియన్స్, ఈ ఒక్క సంఘటన కారణంగా తీవ్రమైన వ్యతిరేకత చూపించడమే కాకుండా, అసలు షోని చూడడమే మానేశారు. కొంతమంది అయితే షో చూస్తున్నప్పటికీ కూడా ఆడియన్స్ ఓట్లకు విలువ లేనప్పుడు ఓట్లు వేయడం ఎందుకు అని ఓట్లు వేయడం ఆపేసారు. శ్రీజ దమ్ము రీ ఎంట్రీ ఇచ్చే వరకు ఈ షోని చూడబోమని, భవిష్యత్తులో ప్రసారమయ్యే సీజన్స్ ని కూడా బ్యాన్ చేస్తాము అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. ఆమె రీ ఎంట్రీ ని కోరుతూ, ప్రతీ రోజు వేలసంఖ్యలో పోస్టులు పెడుతున్నారు నెటిజెన్స్.
శ్రీజ రీ ఎంట్రీ లేకపోతే షో పై చాలా బలమైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని బిగ్ బాస్ టీం కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారట. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, శ్రీజ ని లోపలకు పంపాలా వద్ద అనే నిర్ణయం ఇంకా పెండింగ్ లోనే ఉందని తెలుస్తుంది. పెండింగ్ లో ఉందంటే రీ ఎంట్రీ ఉంది అని కచ్చితంగా చెప్పలేము, అలా అని లేదని కూడా చెప్పలేము. ఇంకా బిగ్ బాస్ టీం ఆలోచిస్తుంది అంటే, ఆమెని మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపే ఆలోచన అయితే సజీవంగానే ఉంది. అయితే ఆమెని ఎలా లోపలకు పంపాలి అనే దానిపై ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఆమెని వైల్డ్ కార్డు క్యాటగిరీ లో పంపించాలా?, లేకపోతే సీక్రెట్ రూమ్ లో పెట్టి లోపలకు పంపే విధంగా హౌస్ మేట్స్ కి చూపించాలా?, ఎలా చెయ్యాలి అనే దానిపై ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం.
ఆమె రీ ఎంట్రీ ఉంటే, రేపు ఎల్లుండి జరగబోయే ఎపిసోడ్స్ లోనే ఉండాలి. లేదంటే ఇక ఎప్పటికీ లేనట్టే అనుకోవాలి. ఒకవేళ వీకెండ్ లో రీ ఎంట్రీ లేకపోతే, వచ్చే వారం మిడ్ వీక్ లో ఎంట్రీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఈ రెండు రోజుల్లోనే తేలనుంది. ఒకవేళ శ్రీజ దమ్ము రీ ఎంట్రీ లేకపోతే, అన్యాయంగా ఆమెని ఎలిమినేషన్ చేసిన తీరుకి, బిగ్ బాస్ రియాలిటీ షో ఉన్నన్ని రోజులు ఒక బ్లాక్ మార్కు గా మిగిలిపోతాది. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ లోనే కాదు, ఏ ఇతర భాషలకు సంబంధించిన బిగ్ బాస్ షోస్ లో కూడా ఇలా ఆడియన్స్ ఓటింగ్ తో కాకుండా, కంటెస్టెంట్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ చేయడం వంటివి ఎప్పుడు జరగలేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.