Vishwambhara: చిరంజీవి విశ్వంభర విషయం లో మళ్ళీ ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడా..?

ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కూడా తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

Written By: Gopi, Updated On : June 16, 2024 12:38 pm

Vishwambhara

Follow us on

Vishwambhara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంతో మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరిలో చాలామంది మెగాస్టార్ అభిమానులే కావడం విశేషం… నిజానికి ఈయన తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పటివరకు కూడా ప్రతిరోజు నిత్య శ్రామికుడిలా శ్రమిస్తూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టే ఈయనకి భారీ సక్సెస్ లు అయితే వస్తున్నాయి.

కానీ నిజానికి ఆయన ప్రతి నిమిషం ప్రేక్షకుడికి తన అభిమానులకి ఏదైతే కావాలో అది ఇవ్వడానికి అనుక్షణం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి తన నట విశ్వరూపంతో ప్రేక్షకులను మెప్పించి ఆయా సినిమాలను విజయతీరాలకు చేర్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే నటుడిగా సక్సెస్ అయి జనాల్లో అంతటి క్రేజ్ ను సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఆ విషయంలో చిరంజీవి వందకు వందశాతం సక్సెస్ అయ్యాడు.

ఇక ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కూడా తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక వాల్తేరు వీరయ్య సినిమాతో 100 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిన చిరంజీవి ఈ సినిమాతో దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దర్శకుడు విశిష్ట కూడా చాలా బాగా చిత్రీకరిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో మరోసారి చిరంజీవి తన పాత సెంటిమెంట్ ని రిపీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఏంటి అంటే సినిమా స్టార్ట్ అయిన మొదట్లోనే హీరో ఇంట్రడక్షన్ ఇచ్చి, ఆ తర్వాత ఒక ఫైట్ పెట్టి దాని తర్వాత సాంగ్ ని పెట్టాలని దర్శకుడితో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ లోనే తన అభిమానులు గాని ప్రేక్షకుడు గాని పాట, ఫైట్ తో తనను చూస్తే సినిమా మొత్తం పాజిటివ్ మైండ్ సెట్ తో చూస్తారనే ఉద్దేశ్యం తోనే ఆయన అలాంటి ట్రిక్స్ ని సినిమాల్లో పెడుతూ ఉంటాడు అంటూ కొంతమంది సినీ మేధావులు ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అయితే చిరంజీవి ఇప్పుడు విశ్వంభర సినిమాలో కూడా వీటిని రిపీట్ చేస్తున్నాడు. తద్వారా భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…