Chaitanya Krishna: ఏం పీకలేరు.. జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు హెచ్చరికలు పంపిన చైతన్యకృష్ణ

గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ కు, నందమూరి కుటుంబానికి గ్యాప్ ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సతీమణిపైవైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే.

Written By: Dharma, Updated On : May 22, 2024 3:55 pm

Chaitanya Krishna

Follow us on

Chaitanya Krishna: ఏపీలో పొలిటికల్ హీట్ ఆగడం లేదు. పోలింగ్ జరిగి దాదాపు పది రోజులు కావస్తోంది. కౌంటింగ్ కు మరో పది రోజుల వ్యవధి ఉంది. అయితే ఎన్నికలు కొన్ని కుటుంబాలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా మెగా కుటుంబంలో చిన్నపాటి వివాదమే రేగింది. మెగా ఫ్యామిలీ అంతా జనసేనకు మద్దతు తెలిపింది. మెగా కుటుంబానికి చెందిన కొందరు హీరోలు స్వయంగా పిఠాపురంలో పవన్ కు మద్దతుగా ప్రచారం చేశారు.

సోషల్ మీడియా ద్వారామద్దతు ప్రకటించిన అల్లు అర్జున్.. నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి నేరుగా వెళ్లి మద్దతు ప్రకటించారు. ఇది దుమారానికి కారణమైంది.మాకు మద్దతు ప్రకటించిన వాడు పరాయివాడైనా మా వాడే.. మాతో ఉండి ఇతరులకు మద్దతు తెలిపిన వాడు మా వాడైనా పరాయి వాడే అంటూ నాగబాబు చేసిన ట్విట్ దుమారానికి దారితీసింది. చివరకు నాగబాబు ట్విట్ డిలీట్ చేయడంతో వివాదం ఆగింది. అయితే మెగా కుటుంబంలో ఈ వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు నందమూరి కుటుంబంలో కొత్త వివాదం ప్రారంభమైంది. ఇటీవల నందమూరి కుటుంబం నుంచి చైతన్య కృష్ణ అనే హీరో పరిచయమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పెను దుమారానికి కారణమవుతోంది.

గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ కు, నందమూరి కుటుంబానికి గ్యాప్ ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సతీమణిపైవైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితులు. కానీ ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై టిడిపి శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అక్రమ కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ సమయంలో సైతం జూనియర్ ఎన్టీఆర్ కనీస స్థాయిలో కూడా స్పందించలేదు. ఈ పరిణామాలన్నీ ఆ కుటుంబంలో ఉన్న గ్యాప్ ను తెలియజేసాయి. అయితే తాజా ఎన్నికల్లో గుడివాడ, గన్నవరం వంటి నియోజకవర్గాల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వైసీపీకి మద్దతు తెలిపారని ఒక ప్రచారం సాగింది.

తాజాగా దీనిపై చైతన్యకృష్ణ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు పంపారు. నందమూరి అభిమానులు అండగా ఉన్నంతవరకు ఏం పీకలేరు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొద్ది రోజుల కిందట సినీ రంగానికి పరిచయమైన చైతన్య కృష్ణ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యారు. దీని వెనుక వైసిపి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారని తాజాగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే రెండు రోజుల కిందటే సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్కు లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి సమయంలో చైతన్య కృష్ణ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా ప్రచారం జరుగుతుంది. మొత్తానికైతే నందమూరి కుటుంబంలోనే సరికొత్త చిచ్చు చర్చనీయాంశంగా మారింది.