Vadde Naveen: 1997 నుంచి ఐదు సంవత్సరాలు ఒక వెలుగు వెలిగిన పేరు వడ్డే నవీన్. నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు పాజిటివ్ టాక్ తో దూసుకొని వెళ్లాడు. మంచి మంచి సినిమాలు చేసి ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు. పెళ్లి, కోరుకున్న ప్రియుడు, స్నేహితులు, మనసిచ్చి చూడు వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈయన నటించిన పెళ్లి అనే సినిమా ఈయన కెరీర్ కే సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.
ఈ సినిమా తర్వాత చక్రి, ప్రేమించే మనసు, మనసిచ్చి చూడు వంటి సినిమాలతో నవీన్ కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈయన ఎవరో కాదు సీనియర్ ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ అల్లుడు అని తెలుసా? రామకృష్ణ కూతురు చాముండేశ్వరి ని పెళ్లి చేసుకున్నాడు నవీన్. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. తర్వాత నవీన్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక వడ్డె నవీన్ స్టార్ హీరోగా ఎదుగుతాడని ఎంతో మంది అనుకున్నారు. కానీ అనుకోకుండా కనుమరుగు అయ్యారు ఈ హీరో.
చివరగా నాలుగు సంవత్సరాల క్రితం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా వచ్చిన ఎటాక్ సినిమాలో కనిపించారు నవీన్. కానీ నవీన్ సెకండ్ ఇన్నింగ్స్ కు ఈ సినిమా పెద్దగా కలిసి రాలేదు. ఇక ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన కోరుకున్న ప్రియుడు సినిమాతో పరిచయం అయిన ఈ హీరో లవర్ బాయ్ గా గుర్తింపు సంపాదించారు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను సంపాదించిన ఈ హీరో ఇప్పుడు బిజినెస్ లతో ఫల్ బిజీగా ఉంటున్నారట. అయితే తనకు సూట్ అయ్యే పాత్రలు వస్తే మాత్రం కచ్చితంగా రీ ఎంట్రీ ఇస్తానంటున్నారు నవీన్.
వ్యక్తిగత సమస్యల వల్ల కెరీర్ లో ఇబ్బందులు పడ్డారనే టాక్ ఉంది. ఇక రీసెంట్ గా హీరో శర్వానంద్ నిశ్చితార్థంలో కనిపించారు. చాలా కాలం తర్వాత నవీన్ కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఆయనలో ఏ మార్పు రాలేదని.. ఇప్పుడు కూడా అంతే అందంగా కనిపిస్తున్నారని అంటున్నారు ఆయన అభిమానులు. మరి ఈయన ఏమైనా సినిమాల్లో నటిస్తారో? అవి ఎలా ఉంటాయో చూడాలి.