Attack On Jagan: జగన్ పై రాళ్లదాడి.. టాలీవుడ్ అంతా ఎందుకు సైలెన్స్ అయ్యింది

అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 53 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. కేవలం నిరాధార ఆరోపణలతో చంద్రబాబును అరెస్టు చేశారని టిడిపి ఆరోపించింది.

Written By: Dharma, Updated On : April 16, 2024 12:19 pm

Attack On Jagan

Follow us on

Attack On Jagan: ఏపీలో రాళ్లదాడి అంశం వివాదాస్పదంగా మారింది. రాజకీయ అంశంగా మారిపోయింది. దాడి చేసింది మీరంటే మీరు అని అధికార, విపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.ఎవరికి తోచిన విధంగా వారు పోస్టులు పెడుతున్నారు. ట్రోల్ చేస్తున్నారు. వైరల్ అంశంగా మార్చేశారు. కానీ సమకాలీన అంశాలపై స్పందించే సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు కనీసం స్పందించకపోవడం విశేషం. కేవలం వైసీపీ సర్కార్ విధానాలపై విసిగి వేశారిపోయిన సినీ రంగ ప్రముఖులు స్పందించడం మానేసినట్లు ప్రచారం జరుగుతోంది.

అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 53 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. కేవలం నిరాధార ఆరోపణలతో చంద్రబాబును అరెస్టు చేశారని టిడిపి ఆరోపించింది. అయితే ఆ సమయంలో వివిధ రంగాల ప్రముఖుల నుంచి చంద్రబాబుకు మద్దతు లభించింది. సినీ రంగాలతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు సైతం స్పందించారు. చంద్రబాబు అరెస్టును ఖండించారు. అయితే ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పై దాడి జరిగిన సినీ ప్రముఖులు ఎవరు స్పందించలేదు. కనీసం ఒక సాధారణ అంశంగా చూసిన సోషల్ మీడియాలో ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయటం లేదు. అయితే గత ఐదేళ్లుగా సినీ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుతోనే వారు స్పందించలేదని తెలుస్తోంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఉన్న కోపంతో.. టికెట్ల ధర తగ్గింపు, సినిమా విడుదలకు అనుమతుల విషయంలో అనేక రకాలుగా అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకొని.. సినీ పరిశ్రమ పెద్దగా కొంతమంది వ్యక్తులతో కలిసి సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. నాడు జగన్ వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. చిరంజీవి పట్ల అమర్యాదగా ప్రవర్తించారన్న టాక్ వినిపించింది. గత ఐదేళ్లుగా సినీ పరిశ్రమకు జగన్ ఎటువంటి చేయూత ఇవ్వలేదు. ఈ పరిణామాలన్నీ వైసీపీకి సినీ పరిశ్రమను దూరం చేశాయి. అందుకే సీఎం జగన్ పై జరిగిన దాడిపై ఏ ఒక్కరూ స్పందించ లేనట్లు తెలుస్తోంది. అయితే దీనిని ఒక అవమానకర పరిణామంగా వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ చర్యల ద్వారా సినీ పరిశ్రమ పవన్ వెంట నడుస్తుందన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.