Simple Kaul: ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలుసుకుందాం. ఒక రంగంలో రాణించాలని ఆసక్తి చూపించింది కానీ మరో రంగంలో కోట్లను కొల్లగొట్టింది ఓ సూపర్ లేడీ. మరి ఆ నటి గురించి తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. అయితే హిందీలో తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా అనే సీరియల్ మీకు గుర్తుందా? అందులో మొదటి భార్య గులాబో పాత్రను పోషించిన నటి కూడా గుర్తుండి ఉండాలి. కానీ ఈమె కొన్ని సంవత్సరాల నుంచి టీవీ రంగానికి దూరంగా ఉంటుంది. కుసుమ్, శరరత్, ఖిచిడి, కుటుంబం అనే అనేక టీవీ షోలలో ముఖ్యమైన పాత్రలను పోషించింది.
ఈమె పేరు సింపుల్ కౌల్. శరరత్, బఖర్వాడి, జిద్ది దిల్ మనే నా, ఓయే జస్సీ వంటి షోలలో నటించి మంచి పేరు సంపాదించింది ఈ నటి. 20 సంవత్సరాలకు పైగా టీవీ సీరియల్స్ లో నటించింది. కుసుమ్ తో రంగ ప్రవేశం చేసిన ఈ నటి మొత్తం 26 షోలలో కనిపించి మెరిసింది. అయితే ఈ షోలు నచ్చలేదో లేకపోతే ఆశించిన ఫలితాలు రాలేదో తెలియదు కానీ బిజినెస్ వైపు అడుగులు వేసింది కోట్లు సంపాదిస్తుంది. ప్రస్తుతం ఈ నటి ఈమె రెస్టారెంట్లను నడుపుతుంది. ముంబైలో అనేక ప్రదేశాలలో ఈమెకు రెస్టారెంట్లు ఉన్నాయి.
2022 సంవత్సరంలో జిద్ది దిల్ మనేనా అనే షో లో ప్రధాన పాత్ర పోషించిన సింపుల్ కౌల్ ఆ తర్వాత మరో షోలో కనిపించలేదు. ఇక నటన రంగం నుంచి దూరంగా వెళ్లి వ్యాపారాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా వచ్చిన బిజినెస్ రెస్టారెంట్లు. తన స్నేహితురాలు అదితి మాలిక్ తో కలిసి వ్యాపారవేత్తగా కెరీర్ ను ప్రారంభించింది. అందులో భాగంగానే సొంత రెస్టారెంట్ ను 1 BHK లో ప్రారంభం చేసింది. కానీ ఇప్పుడు ఇవి ముంబైలో చాలా ఫేమస్ గురు. ఈమె బెంగళూరులో కూడా కొత్త బ్రాంచ్ ప్రారంభించింది.
ఈ నటి మొత్తంగా రూ. 25 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తుంది అని టాక్. ఇప్పుడు చైనీస్ ఫుడ్ పై కూడా ఆసక్తి చూపిస్తూ మరో రెస్టారెంట్ ను ప్రారంభించాలి అనుకుంటుందట. ఇక 2010లో రాహుల్ లుముంబా ను పెళ్లి చేసుకుని నటనకు దూరం అయింది. మొత్తం మీద ఈ రేంజ్ లో సంపాదించడం అంటే గ్రేటే కదా.