https://oktelugu.com/

Harshavardhan Rameshwar: ఎవరీ సంగీత దర్శకుడు.. అర్జున్ రెడ్డి, యానిమల్ తో హిట్ కొట్టినా ఎందుకు పేరు రాలేదు..?

బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో నాల్గోవ సినిమాగా వస్తున్న 'బిబి 4' (వర్కింగ్ టైటిల్) మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి...రోటీన్ సినిమా డైరెక్టర్ గా గుర్తింపు పొందిన బోయపాటి శ్రీను సైతం ప్రస్తుతం బాలయ్య బాబుతో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక అందులో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ ను కూడా ఇచ్చారు.

Written By:
  • Gopi
  • , Updated On : July 24, 2024 / 05:47 PM IST

    Harshavardhan Rameshwar

    Follow us on

    Harshavardhan Rameshwar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు మూస ధోరణికి స్వస్తి పలికి ఇప్పుడు కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ఇక అందరు కొత్త కథలతో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ డైరెక్టర్లు ప్రతి చిన్న విషయంలో కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. రోటీన్ సినిమా డైరెక్టర్ గా గుర్తింపు పొందిన బోయపాటి శ్రీను సైతం ప్రస్తుతం బాలయ్య బాబుతో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక అందులో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ ను కూడా ఇచ్చారు. ఇక ఈ సినిమా ఎప్పుడు రెగ్యులర్ షూట్ కి వెళ్తుంది. అనేదాని మీదనే సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన మూడు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆటోమేటిగ్గా ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే బోయపాటి శ్రీను కూడా చాలా వరకు ఈ సినిమాను చాలా స్టైలిష్ గా తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక గత సినిమాలా మాదిరిగా కాకుండా ఈ సినిమాలో కథను చాలా బలంగా రాసుకున్నారట. ఇక బాలయ్య ఈ సినిమాలో కూడా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని బోయపాటి చెప్పడం విశేషం… ఇక అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా కొత్త వాళ్ళని తీసుకుందామనే ఆలోచనలో బోయపాటి ఉన్నాడట. వరుసగా బోయపాటి సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.

    Also Read: ‘సరిపోదా శనివారం’ మూవీ ఎస్ జే సూర్య కి ఎంత వరకు హెల్ప్ అవుతుంది…

    ఇక బాలయ్య బాబు సినిమాలకు కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పటికైనా వీళ్ళిద్దరూ కొంచెం చేంజ్ కావాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన ‘హర్షవర్ధన్ రామేశ్వర్’ ను ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలనే ప్రయత్నంలో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ లో ఒక ఫ్రెష్ ఫీల్ ఉందని అతనైతే ఈ సినిమాకు న్యాయం చేయగలరనే ఉద్దేశ్యంతో బోయపాటి అతన్ని సెలెక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది.

    ఇక మొత్తానికైతే బోయపాటి లాంటి రోటీన్ సినిమాలను తీసే దర్శకుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి రోజులు వచ్చాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక హర్షవర్ధన్ రామేశ్వర్ అర్జున్ రెడ్డి సినిమా కోసం అదిరిపోయే మ్యూజిక్ ని ఇచ్చాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అయితే ఆయన ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవల్లో ఉందనే చెప్పాలి. ఇక రీసెంట్ గా వచ్చిన ‘అనిమల్ ‘ సినిమాతో కూడా ఒక బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు.

    అయినప్పటికీ తనకు రావాల్సిన గుర్తింపు అయితే రావడం లేదు. ఇక ఇప్పుడు బాలయ్య బాబుతో కనక సినిమా పడితే ఆయన కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక మొత్తానికైతే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా కొత్త పుంతలు తొక్కుతూ ప్రేక్షకులను మెప్పించడానికి ట్రై చేస్తుండటం విశేషం…ఇక బాలయ్య బోయపాటి కాంబో లో మరోసారి ఒక ఫ్రెష్ ఫీల్ ఉన్న కథ రాబోతున్నట్టుగా తెలుస్తుంది…

    Also Read:  ప్రశాంత్ నీల్ ఆ స్టార్ హీరోతో వరుసగా రెండు సినిమాలు చేస్తున్నాడా..?