Avatar 3 vs Pushpa 2: మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మన ఇండియన్ సినిమాలకంటే ఎక్కువ క్రేజ్ ఉన్నటువంటి హాలీవుడ్ సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో అవతార్ ఒకటి. 2010 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3.4 బిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఈ రికార్డు ని ఒక్కరు కూడా ముట్టుకోలేదు. ‘అవతార్ 2 : ది వే ఆఫ్ వాటర్’ కూడా 3 బిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది కానీ, ‘అవతార్’ ఫుల్ రన్ రికార్డు ని మాత్రం అందుకోలేకపోయింది. కానీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘అవతార్ 2’ చిత్రానికి మొదటి రోజున 140 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈమధ్య విడుదల అవుతున్న ప్రతీ పాన్ ఇండియన్ సినిమాకు 100 కోట్ల గ్రాస్ కి పైగా ఓపెనింగ్ వసూళ్లను రాబట్టడం సాధారణం అయిపోయింది.
‘అవతార్ 3′(Avatar 3: The Fire & Ash) చిత్రం కచ్చితంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓపెనింగ్ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి, నెంబర్ 1 గా నిలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ చివరికి ఆల్ టైం టాప్ 20 ఓపెనింగ్ వసూళ్లను కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఓవరాల్ గా ఇండియా వైడ్ ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి 35 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. కచ్చితంగా హిందీ వెర్షన్ లో పుష్ప 2 రికార్డుని కొడుతుందని అనుకున్నారు. కానీ ‘పుష్ప 2’ లో సగం వసూళ్లు మాత్రమే వచ్చాయి. ‘పుష్ప 2’ చిత్రానికి మొదటి రోజున అక్షరాలా 70 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ‘అవతార్ 3’ కూడా మా అల్లు అర్జున్ రికార్డ్స్ ని బద్దలు కొట్టలేకపోయిందని గర్వంగా చెప్పుకుంటున్నారు.
ఫుల్ రన్ లో కూడా ఈ చిత్రం హిందీ వెర్షన్, పుష్ప 2 లో సగం కూడా ఉండదని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ చిత్రానికి కనీసం పది కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు అట. తెలుగు రాష్ట్రాల్లో ‘అవతార్ 2’ చిత్రానికి ఫుల్ రన్ లో వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ‘అవతార్ 3’ కి కనీసం వంద 50 కోట్ల గ్రాస్ అయినా వస్తుందా అంటే అనుమానమే. చాలా మంది ‘అవతార్ 2’ కంటే ‘అవతార్ 3 ‘ బెటర్ గా ఉందని, చాలా వరకు ఎమోషన్స్ మూడవ భాగం లో వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. మరి వసూళ్లు ఆ రేంజ్ లో రిజిస్టర్ అవుతాయో లేవో చూడాలి.