Sajjala Ramakrishna Reddy: కౌంటింగ్ ఏజెంట్లు రుబాబు చేయండి.. సజ్జల సలహా దుమారం

సాధారణంగా కౌంటింగ్ కేంద్రాల్లో 25 మంది వరకు ఏజెంట్లు ఉంటారు. కానీ ఇండిపెండెంట్ లకు సంబంధించి ఏజెంట్లను సైతం వైసీపీ కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Written By: Dharma, Updated On : May 30, 2024 12:56 pm

Sajjala Ramakrishna Reddy

Follow us on

Sajjala Ramakrishna Reddy: గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. పోలింగ్ నాడు, పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇవి కొనసాగాయి. కేంద్ర బలగాలు రావడంతో సద్దుమణిగాయి.అయితే ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియలో గందరగోళం సృష్టించడానికి వైసిపి ప్రయత్నిస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. రూల్స్ పాటించేవారు కాకుండా.. వాదనకు దిగే వారు మాత్రమే ఏజెంట్లుగా వెళ్లాలని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఎక్కడైనా రూల్స్ పాటించాలని, రూల్స్ తెలియని వారి కోసం శిక్షణ ఇచ్చి పంపిస్తారు. కానీ వైసీపీలో విరుద్ధ పరిస్థితి ఉంది. కేవలం గలాటా సృష్టించే వారికి ఫస్టు ప్రయారిటీ దక్కడం విశేషం.

ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు సంబంధించి వైసీపీ నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఆర్వో సంతకం కానీ, ముద్ర కానీ లేకుంటే ఓట్లు చెల్లుబాటు కావు. అయితే ఈసారి ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఓట్లు వేసి నందున.. సంతకం, సీలు విషయంలో మినహాయింపు ఇవ్వాలని టిడిపి కొద్ది రోజుల కిందట ఎలక్షన్ కమిషన్ ను కోరింది. దీనిపై ఈసీ సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే టిడిపి కోరిన వెంటనే ఎలా మినహాయిస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. దీనిపైనే కౌంటింగ్ కేంద్రంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సాధారణంగా కౌంటింగ్ కేంద్రాల్లో 25 మంది వరకు ఏజెంట్లు ఉంటారు. కానీ ఇండిపెండెంట్ లకు సంబంధించి ఏజెంట్లను సైతం వైసీపీ కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి ఈసీ పటిష్ట భద్రత చర్యలు చేపట్టింది.ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో గలాటా సృష్టిస్తే బడిత పూజకు సైతం సిద్ధపడుతోంది. ఇవన్నీ తెలిసి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు ఏజెంట్లకు రూల్స్ అవసరం లేదని.. కేవలం రుబాబుగా ఉండాలని చెబుతుండడం వైసిపి కౌంటింగ్ ఏజెంట్లకు సైతం మైండ్ బ్లాక్ అవుతోంది. మరోవైపు 20 మంది వరకు వైసిపి కౌంటింగ్ ఏజెంట్లే లోపల ఉంటారని.. అవసరమైతే గందరగోళం సృష్టిస్తామని పేర్ని నాని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చారు. మొత్తానికైతే కౌంటింగ్లో గట్టిగానే ప్రతాపం చూపేందుకు వైసిపి ప్రయత్నిస్తోంది. మరి దానిని టిడిపి కూటమి ఎలా అధిగమిస్తుందో చూడాలి. ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.