Toughest Courses: కూడు, గుడ్డ, ఆవాసం తర్వాత మనిషి కావాల్సింది చదువు. ఆ చదువు బాగుంటేనే మనిషికి విలువ ఉంటుంది. లేకుంటే ఈ సమాజం గుర్తించదు. మనిషి అవసరాలు పెరగడం.. సమాజం విస్తరించడంతో కొత్త కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. అలాంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆ స్థాయిలో సరికొత్త కోర్సులు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి కోర్సుల్లో కొన్ని అత్యంత కఠినమైనవి ఉన్నాయి. ఎంత వివేకవంతుడైనా సరే ఎప్పుడో ఒకసారి ఆ కోర్సులో డ్రాపౌట్ కాక తప్పదని చెబుతున్నారు విద్యావేత్తలు. ఇంతకీ ఆ కోర్సులు ఏమిటో ఒకసారి తెలుసుకుందామా..
ఫార్మసీ
మనదేశంలో ఇంటర్ తర్వాత చదివే కోర్స్ ఇది. బీఫార్మసీ, ఎం ఫార్మసీ అనే రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీఫార్మసీ చేసిన తర్వాత.. అందుకు అనుగుణంగా అర్హత పరీక్ష రాసి ఎం ఫార్మసీ చేస్తారు. ఫార్మసీ కోర్సులో రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, ఫార్మకాలజిని ప్రధానంగా చదవాల్సి ఉంటుంది. ఔషధాల అభివృద్ధి, వాటి సూత్రికరణ, పనిచేసే విధానం వంటి అధ్యయనాల ఆధారంగా ఈ కోర్సు చదవాల్సి ఉంటుంది. అత్యంత క్లిష్టమైన సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి ఈ కోర్సులో డ్రాపౌట్ రేట్ పది నుంచి పదిహేను శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది.
అక్టోరియల్ సైన్స్(బీమా లెక్కింపు శాస్త్రం)
ఇది గణితం, బీమా, ఆర్థిక శాస్త్రం వంటి సబ్జెక్టులతో మిళితమై ఉంటుంది. అత్యంత కఠినమైన సవాళ్లతో ఈ కోర్స్ ను రూపొందించారు. ఈ కోర్సు మొదటి రెండు సంవత్సరాల్లో డ్రాపౌట్ 20 నుంచి 25% వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇందులో ప్రావీణ్యం సంపాదించిన వారికి బహిరంగ మార్కెట్లలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
సంగీత ప్రదర్శన(music performance)
చాలామంది సంగీతానికి సంబంధించిన కోర్సు ఫైన్ ఆర్ట్స్ కిందికి వస్తుందని భావిస్తుంటారు. కానీ అది తప్పు. సంగీతానికి సంబంధించిన కోర్స్ అత్యంత కఠినంగా ఉంటుంది. జన రంజకమైన పాటలు.. సంగీతం అందించాలంటే అంత సులభమైన విషయం కాదు. దానికి సంబంధించిన నోట్స్.. ఇతర కృత్యాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ కోర్సులో 15 నుంచి 20% వరకు డ్రాపౌట్స్ ఉంటాయట.
విదేశీ భాష నేర్చుకోవడం(foreign language learning course)
ప్రపంచం మొత్తం ఒక కుగ్రామం అయిపోయిన తర్వాత.. విదేశాలలో స్థిరపడాలనుకునేవారు ఆ దేశాలకు సంబంధించిన భాషలు నేర్చుకోవాలనుకుంటారు. ప్రపంచంలో ఇంగ్లీష్ తర్వాత ఆ స్థాయిలో ప్రామాణికంలో ఉంది మాండరిన్ దీనినే చైనీస్ భాష అంటారు. ఈ చైనీస్ భాష నేర్చుకోవడం అత్యంత కఠిన మట. దీని తర్వాత కొరియన్, అరబిక్, జపనీస్ భాషలో అత్యంత క్లిష్టంగా ఉంటాయట. అందుకే ఈ కోర్సులలో చేరిన వారిలో పది నుంచి 15% వరకు డ్రాపౌట్స్ ఉంటాయట.
ఫైన్ ఆర్ట్స్
చాలామంది ఫైన్ ఆర్ట్స్ కోర్స్ అంటే సులభం అనుకుంటారు. కానీ అత్యంత సవాళ్లతో కూడుకొని ఉంటుంది. ప్రఖ్యాత రోడ్డు ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్, సెంట్రల్ సెయింట్ మార్టిన్స్ వంటి ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందేవారిలో డ్రాపౌట్స్ రేటు 20 నుంచి 30% వరకు ఉంటుందట.
సైకాలజీ (మనస్తత్వశాస్త్రం)
ఈ కోర్సు చాలా విభిన్నంగా ఉంటుంది. అర్థమైనట్టే ఉంటుంది గానీ.. అనేక సంక్లిష్టతలను మన ముందు ఉంచుతుంది. ఆ సంక్లిష్టతలను అధిగమించిన వారే సైకాలజిస్ట్ గా స్థిరపడతారు. అందువల్లే ఈ కోర్సు చదివే వారిలో పది నుంచి పదిహేను శాతం వరకు డ్రాపౌట్ రేట్స్ ఉంటాయి.
నర్సింగ్
వైద్యరంగంలో వైద్యుల తర్వాత ఆ స్థాయిలో పని చేసేది నర్సులు. మన సమాజంలో వీరి పట్ల చులకన భావం ఉంటుంది కానీ.. వీరి కోర్సు అత్యంత క్లిష్టమైనది. దాదాపు డాక్టర్ స్థాయిలో వీరు చదవాల్సి ఉంటుంది. ఈ కోర్సులో 10 నుంచి 15% వరకు డ్రాపౌట్ రేట్స్ ఉంటాయి.
పరిశోధనాత్మక జర్నలిజం
జర్నలిజం అంటే ఇప్పుడు అమ్ముడు సరుకు అయిపోయింది గాని.. ఒకప్పుడు జర్నలిజం అంటే అదొక పాషన్ లాగా ఉండేది. అయితే నేటికీ పరిశోధనాత్మక జర్నలిజానికి మార్కెట్లో చాలా విలువ ఉంది. ఈ పరిశోధనాత్మక జర్నలిజం చాలా కఠినమైన కోర్స్. ఇందులో అనేక సవాళ్లు ఉంటాయి. పరిశోధనాత్మక జర్నలిస్టులు రాసే రాతల ద్వారా సమాజం తీవ్రంగా ప్రభావితమవుతుంది కాబట్టి.. అనేక న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానికంటే ముందు అనేక పుస్తకాలను ఔపోసన పట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ కోర్సులో డ్రాపౌట్ 20 నుంచి 25% వరకు ఉంటుంది.
గణాంకాల శాస్త్రం (statistics)
గణితానికి సంబంధించిన కోర్సులో గణాంకాల శాస్త్రానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇది గణితంతో సంబంధం ఉన్నప్పటికీ.. విభిన్నమైన అంశాలు ఈ కోర్సులో ఉంటాయి. చాలామంది ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసే క్రమంలో ఒత్తిడికి గురవుతుంటారు. గణాంకాలను విశ్లేషించే క్రమంలో ఇబ్బంది పడుతుంటారు. అందువల్ల ఈ కోర్సులో పది నుంచి పదిహేను శాతం డ్రాపౌట్ ఉంటుంది.