Game Changer: రామ్ చరణ్ జరగండి పాటలో ఎవ్వరూ గమనించని పెద్ద తప్పు ఇదీ?

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఇందులో కియారా అద్వానీ చెర్రీ సరసన నటిస్తోంది.ఇక ఈ సినిమా నుంచి జరగండి పాటను విడుదల చేశారు మేకర్స్.

Written By: Swathi Chilukuri, Updated On : March 28, 2024 12:23 pm

Game Changer

Follow us on

Game Changer: నిన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చెర్రీ మదర్ ఈయన పుట్టిన రోజు సందర్భంగా 500 మందికి అన్నదానం చేసింది. ఇక చరణ్, ఉపాసనలు తమ కూతురు తో కలిసి తిరుమల తిరుపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా క్లీంకార ఫేస్ కూడా రివీల్ అయింది. ఇదిలా ఉంటే ఆయన సినిమాలకు సంబంధించిన ఎన్నో అప్డేట్ లు వచ్చాయి.

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఇందులో కియారా అద్వానీ చెర్రీ సరసన నటిస్తోంది.ఇక ఈ సినిమా నుంచి జరగండి పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటను అనంత శ్రీరామ్ రాస్తే.. తమన్ స్వరపరిచారు. దలేర్ మెహందీ, సునిధి చౌహాన్ లు పాటను పాడారు. ఇక కొరియోగ్రఫీగా ప్రభుదేవా అద్భుతమైన స్టెప్స్ ను అందించారు. రియల్ లొకేషన్ ను తలపించేలా వేసిన సెట్ బాగుంది. పాట కూడా చాలా కలర్ ఫుల్ గా ఉంది.

పాటలో కియారా, రామ్ చరణ్ ల గెటప్స్ అదిరిపోయాయి. అంతేకాదు చాలా డిఫరెంట్ గా కనిపిస్తాయి కూడా. మరి శంకరా మజాకా? ఆ మాత్రం ఆకర్షణం ఉండాల్సిందే అంటారు ఆయన అభిమానులు. పాటల్లో లొకేషన్స్, హీరో హీరోయిన్స్ వేసుకునే బట్టలు, లొకేషన్స్ ఇవన్నీ కొత్తగా అనిపిస్తాయి. ఒక లిరిక్ లో రామ్ చరణ్ వేసుకున్న బట్టల మీద కియారా అద్వానీ ఫోటోలు ఉన్నాయి.

ఈ పాట ఎన్నో సార్లు విడుదలకు సిద్దం అయింది కానీ ఎందుకో వాయిదా పడుతూ వచ్చింది. ఇక రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సాంగ్ ను విడుదల చేశారు. కానీ ఈ పాటలో ఓ తప్పు ఉంది. అది మీరు గమనించారా? పాటకు సంబంధించిన ఫుల్ వీడియో లేదు కానీ లిరిక్స్ మాత్రం ఉన్నాయి. ఇందులో సర్పైజ్ అనే పదం స్పెల్లింగ్ చూశారా? అది తప్పుగా రాశారు. SURPRISE ఇలా రాయాలా? SUPPRISE ఇలా రాశారు. కావాలని రాశారో.. లేదా చూసుకోకుండా చేశారో కానీ మొత్తం మీద స్పెల్లింగ్ మాత్రం తప్పుగా వచ్చింది.