Horoscope Today: ఈ రెండు రాశుల వారికి ఈరోజు లక్ష్మీయోగం..

2025 మే 17 శుక్రవారం రోజున ద్వాదశ రాశులపై పూర్వ పాల్ఘుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహరాశిలో సంచారం చేయనున్నాడు.

Written By: Chai Muchhata, Updated On : May 17, 2024 8:21 am

Horoscope Today

Follow us on

Horoscope Today: 2025 మే 17 శుక్రవారం రోజున ద్వాదశ రాశులపై పూర్వ పాల్ఘుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహరాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో రెండు రాశుల వారికి లక్ష్మీయోగం.. మరికొన్ని రాశుల వారికి కష్టాలు తప్పవు. 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
ఈ రాశి వారు కొన్న కష్టలను ఎదుర్కొంటారు.ఏ పని చేసినా దానిపై శ్రద్ధ వహించాలి. చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా మార్చుకోవాలి.

వృషభ రాశి:
వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉంటారు. ఖర్చులను నియంత్రించాలి. భవిష్యత్ కోసం కొన్ని పెట్టుబడులు పెడుతారు.

మిథున రాశి:
స్నేహితులతోసరదాగా ఉంటారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడుతారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. బ్యాంకు బ్యాలెన్స్ కూడా బాగుంటుంది.

కర్కాటక రాశి:
ఈ రోజు ప్రశాంతంగా గడుపుతారు. విద్యార్థులు కెరీర్ కోసం ప్లాన్ చేస్తారు. శాంతంగా ఉండాలి. డబ్బు ఖర్చు విషయంలో నియంత్రణ ఉండలి. ప్రతి దానికి స్పందించాల్సిన అవసరం లేదు.

సింహారాశి:
ఈ రాశి వారు ఈరోజు కష్టపడాల్సి వస్తుంది. కమ్యూనికేషన్ రంగంలో జాగ్రత్తగా ఉండాలి. పలువురికి మీపై విశ్వాసం పెరుగుతుంది. దేనికైనా ఓర్పుతో ఉండాలి.

కన్య రాశి:
ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఏ పని చేపట్టినా విజయం వీరిదే ఉంటుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్ లో మంచి లాభాలు వస్తాయి.

తుల రాశి:
ఈ రాశి వారు ఈరోజు ఆహ్లదంగా గడుపుతారు. స్టాక్ మార్కెట్లో కొత్తగా పెట్టుబుడులు పెడుతరు. వ్యాపారం చేయడానికి డబ్బు సమకూతురుంది. భాగస్వామితో ప్రేమగా ఉంటారు.

వృశ్చిక రాశి:
జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు ప్రమోషన్ల విషయంలో శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయి.

ధనస్సు రాశి:
ఈ రాశి వారు ఈరోజు రాజకీయాలకు దూరంగా ఉండాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. చాలా విషయాల్లో ఇతరులతో వాగ్వాదాలకు దిగకుండా ఉండాలి.

మకర రాశి:
కొత్త ప్రాజెక్టు బాధ్యతలు చేపడుతారు. వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

కుంభరాశి:
ప్రత్యతర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేపట్టినా సక్సెస్ అవుతుంది. ప్రశాంత వాతావరణంలో గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మీనరాశి:
వైవాహిక జీవితం సంతోసంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఖర్చులను నియంత్రించాలి.