Dude 3 Days Collections: ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డ్యూడ్'(Dude Movie) దీపావళి విన్నర్ గా నిల్చింది. కానీ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం చాలా కష్టం గా మారిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రదీప్ మొదటి రెండు సినిమాలు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించడంతో, ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 55 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 27 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 33 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. నేడు, రేపు సెలవు దినాలు కాబట్టి, ఈ రెండు రోజులు వచ్చే వసూళ్లతో కొంతవరకు రీ కవర్ అవ్వొచ్చు.
కానీ ఈ చిత్రానికి శనివారం వచ్చిన వసూళ్లతో పోలిస్తే, ఆదివారం వచ్చిన వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఇక్కడే బయ్యర్స్ భయపడుతున్నారు. శనివారం రోజున ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ఆదివారం రోజున కేవలం 15 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఎక్కడైనా ఆదివారం రోజున శనివారం కంటే భారీ వసూళ్లు నమోదు అవుతుంటాయి. కానీ ఈ చిత్రానికి ఊహించని విధంగా భారీ డ్రాప్ సొంతం చేసుకుంది. ఇది లాంగ్ రన్ కి శుభసూచికం కాదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి 5 కోట్ల 63 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 5 కోట్ల 37 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి.
బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు తక్కువ అవకాశాలే ఉన్నాయి కానీ, ఒకవేళ నష్టం వచ్చినా భారీగా ఉండవని అనుకోవచ్చు. ఓవరాల్ గా ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను చూస్తే తమిళనాడు నుండి 21 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తెలుగు రాష్ట్రాల నుండి 10 కోట్ల 25 లక్షలు, కర్ణాటక నుండి 2 కోట్ల 90 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి కోటి 85 లక్షలు, ఓవర్సీస్ నుండి 18 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 45 శాతం రికవరీ ని సాధించిన ఈ చిత్రం పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి క్లీన్ హిట్ స్టేటస్ ని అందుకోవాలంటే ఈ వీకెండ్ వరకు స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరి పండగ తర్వాత ఈ సినిమా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.