Balakrishna: బాలకృష్ణకు భార్య, తల్లి పాత్రలో నటించిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటూ చీర కట్టులో తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తుంటుంది సుహాసిని. అందువల్లే ఒకప్పుడు హీరోయిన్ గా నటించినా ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మెప్పిస్తుంది.

Written By: Swathi, Updated On : May 24, 2024 3:31 pm

Balakrishna

Follow us on

Balakrishna: గతంలో కొందరు హీరోయిన్ లు సీనియర్ హీరోలతో నటించి స్టార్లుగా ఎదిగారు. అందులో మరీ ముఖ్యంగా మీకు సుహాసినీ గుర్తు ఉండే ఉంటుంది. ఇక ఈమె తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, తదితర స్టార్ హీరోలతో కలిసి హీరోయిన్ గా నటించింది. అయితే నటి సుహాసిని తన సినిమా జీవితంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా కెరీర్ ను రన్ చేసింది. తర్వాత దిగ్గజ దర్శకుడు మణిరత్నం తో వివాహం చేసుకోగా ఓ కుమారుడు జన్మించాడు. మొత్తం మీద ఫ్యామిలీతో సెటిల్ అయింది ఈ హీరోయిన్.

ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటూ చీర కట్టులో తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తుంటుంది సుహాసిని. అందువల్లే ఒకప్పుడు హీరోయిన్ గా నటించినా ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మెప్పిస్తుంది. కానీ ఈమె వద్దకు వచ్చిన ప్రతి పాత్రను ఒప్పుకోకుండా సెలెక్ట్ గా ఉంటూ దర్శకులను చూసి మరీ సినిమాలను ఒప్పుకుంటుందట. దానివల్లే సుహాసిని వెండితెరమీద పెద్దగా కనిపించడం లేదు. రీసెంట్ గా వెబ్ సిరీస్ లతో అమ్మమ్మ పాత్రతో కనిపించింది. ఇక ఈ పాత్రతో కూడా మెప్పించింది సుహాసిని.

సుహాసిని బాలకృష్ణతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. మంగమ్మగారి మనవడు, బాలగోపాలుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే సుహాసిని బాలకృష్ణ సరసన హీరోయినిగానే కాకుండా.. తల్లిగా కూడా నటించింది అని మీరు గమనించారా?.గతంలో పాండురంగడు, ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?, మంగమ్మగారి మనవరాలు వంటి సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు. ఇక రీసెంట్ గా బోయపాటి శ్రీను దర్శకత్వం లో 2014 లో బాలకృష్ణ లెజెండ్ మూవీ లో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం లో బాలకృష్ణ కి తల్లి పాత్రలో సుహాసిని కనిపించింది. ఇలా సుహాసిని బాలకృష్ణ సరసన హీరోయిన్ గా.. తల్లిగా నటించి మెప్పించింది.

ఈ నటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ.. తన సినిమాలు, ప్రాజెక్ట్‌లు, షోలకు సంబంధించిన క్యాస్టూమ్స్‌తో సుహాసిని ఫోటో షూట్ లను పంచుకుంటుంది. ప్రస్తుతం సుహాసిని కొన్ని తెలుగు చిత్రాలను కూడా చేస్తోన్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా సుహాసిని తనకు నచ్చిన పాత్రలను పోషించుకుంటూ వెళ్తోంది. తెలుగులోనే కాదు తమిళ సినిమాలతో కూడా బిజీగా ఉంది సుహాసిని.