Sukumar Movies:ఇండియాలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటే, అతని తర్వాత స్థానంలో సుకుమార్ ఉంటాడు. వీళ్ళిద్దరూ చేసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తూ రావడమే కాకుండా పాన్ ఇండియాలో వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించి పెట్టాయి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్ (Sukumar)…ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో ఆయన టాప్ 3 ఉన్నాడు. ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం…రీసెంట్ గా ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో తనకంటూ ఒక భారీ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ (Ram Charan) తో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపించినప్పటికి, ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే వీళ్ళ కాంబినేషన్లో సినిమా రావడంలేదనే వార్తలైతే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన తన తదుపరి సినిమాను ఎవరితో చేయబోతున్నాడు అనే విషయాల మీద సరైన క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇప్పటికే ఈయన చేసిన సినిమాల్లో చాప సినిమాలుగా క్లాసికల్ హిట్స్ గా నిలిచిపోగా, మరికొన్ని సినిమాలు మాత్రం సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక కొన్ని సినిమాలు డిజాస్టర్ గా మారిన విషయం కూడా మనకు తెలిసిందే. తన ఎన్టీఆర్ కెరియర్ లో చేసిన సినిమాలన్నింటిలో తన భార్యకి నచ్చని సినిమా ఏంటి అంటే ‘ఆర్య 2’ (Aarya 2).. అవును ఆ సినిమాలో హీరో క్యారెక్టర్జేషన్ ఆమెకు నచ్చలేదంట.
అందులో హీరో ఒకసారి కన్నింగ్ ఉంటాడు. మరోసారి తన ఫ్రెండుని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలా మల్టీ యాంగిల్ లో ఆయన క్యారెక్టర్ ఉంటుంది. కాబట్టి అందుకే ఆమెకి పెద్దగా నచ్చలేదట. ఇక ఈ విషయాన్ని సుకుమార్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…
సుకుమార్ వాళ్ల నాన్నకి మాత్రం వన్ (One) సినిమా అంటే చాలా ఇష్టమట. మొదటి షో చూసిన తర్వాత సినిమా బాగుంది. కానీ జనాలకి అర్థం కాదు అంటూ సుకుమార్ కి వాళ్ళ నాన్న చెప్పిన మాట ఇప్పటికి చాలా గర్వంగా అనిపిస్తుందట… మరి ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు.
ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి సుకుమార్ తో సినిమా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయన మాత్రం సెలెక్టెడ్ గా కొంతమంది హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…