https://oktelugu.com/

Chitrakoot: రామయ్య నడయాడిన మరో ప్రాంతం.. ఆనవాలు కూడా ఉన్నాయి..

రాక్ పెయింటింగ్స్‌లో సామూహిక స్ఫూర్తిని అద్భుతంగా చిత్రీకరించారు. గతంలో కూడా చిత్రకూట్‌లోని సర్హత్‌లో రాక్ పెయింటింగ్‌లను గుర్తించిన విషయం తెలిసిందే.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 19, 2024 / 09:00 AM IST

    Chitrakoot

    Follow us on

    Chitrakoot: ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాకు శ్రీరామాయణంతో చాలా దగ్గరి సంబంధం ఉంది. శ్రీరామ చంద్రుడు తన వనవాస కాలం అడవులు, పర్వతాలలో తిరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జార్ఖండ్‌లోని అనేక ప్రాంతాలలో తిరుగుతూనే చిత్రకూట్‌లో కూడా అడుగు పెట్టారట. ఇక్కడ రామాయణ కాలం నుంచి ఎన్నో అద్భుతమైన గుహలు, నదులు ఉన్నాయి అని టాక్. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలోని మాణిక్‌పూర్ చుట్టుపక్కల రాక్ పెయింటింగ్‌లు చాలా కనిపిస్తుంటాయి..

    ఈ రాక్ పెయింటింగ్స్‌లో సామూహిక స్ఫూర్తిని అద్భుతంగా చిత్రీకరించారు. గతంలో కూడా చిత్రకూట్‌లోని సర్హత్‌లో రాక్ పెయింటింగ్‌లను గుర్తించిన విషయం తెలిసిందే. అయితే పురావస్తు ప్రేమికుడు అనుజ్ హనుమత్.. అతని సహచరులు ఈ ప్రదేశం చుట్టూ అనేక కొత్త, పెద్ద రాతి చిత్రాలను కనుగొన్నారట. ప్రస్తుతం పురావస్తు శాఖ, చరిత్రకారులు వీటిపై పరిశోధనలు చేస్తున్నారు. మాణిక్‌పూర్ లోయ, అలహాబాద్‌లోని బెలాన్ లోయ కూడా భౌగోళిక దృక్కోణం నుంచి సమానంగా ఉంటుంది.

    దీని కారణంగా చిత్రకూట్‌లో ప్రాచీన శిలాయుగ సంస్కృతి వృద్ధి చెందలేదంటారు నిపుణులు. ఇది పరిశోధనకు సంబంధించిన అంశం అయినా..రాక్ పెయింటింగ్‌ల గుర్తులు, సేకరణ ఇక్కడ ప్రాచీన శిలాయుగ సంస్కృతి ఉనికిని సూచిస్తుంటాయి. ఇప్పటివరకు ధృవీకరించిన పురాతన శిలాయుగానికి చెందిన అన్ని రాతి చిత్రాలల్లో.. వ్యక్తులు సమూహాలు ఉంటాయి. ఈ రాతి చిత్రాలలో ప్రజలు వేటాడటం, పెంపుడు జంతువులను ప్రదర్శించడం, ఆహారం కోసం నడవడం వంటివి కనిపిస్తుంటాయి.

    ఇవే కాదు దీనితో పాటు శిలలపై యుద్ధానికి సంబంధించిన అనేక రాతి చిత్రాలు కూడా ఉన్నాయి. శ్రీరామ చంద్రుడు సీతామాత.. లక్ష్మణుడితో కలిసి పదకొండున్నర సంవత్సరాలు వనవాసం చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఎక్కవ కాలం ఉన్నారట. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా చాలా చోట్ల కనిపిస్తుంటాయి. అయితే ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇవి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు స్థానికులు. వీటిని సంరక్షించాలని కోరుతున్నారు కూడా.