Vishwambhara: చిరంజీవి విశ్వంభర సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్…

చిరంజీవి నిజానికైతే కమర్షియల్ సినిమా చేయాలి. కానీ ఈ ఏజ్ లో కొన్ని ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేద్దామనే ఉద్దేశ్యంతోనే తను ఈ ప్రాజెక్టును ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక 70 సంవత్సరాలకు దగ్గరలో ఉన్న చిరంజీవి ఇప్పుడు కూడా చాలా సాహసోపేతమైన సినిమాలు చేస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు.

Written By: Gopi, Updated On : May 14, 2024 4:52 pm

Vishwambhara

Follow us on

Vishwambhara: ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా సోషియో ఫాంటసీ సినిమా గా తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి సోషియో ఫాంటసీ సినిమాను చేసిన చిరంజీవి ఆ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో కూడా ఒక అద్భుతమైన విక్టరీని సాధించి తనకున్న పేరు ప్రఖ్యాతలను మరింత రెట్టింపు చేసుకోవాలనే ఉద్దేశ్యం తోనే ఆయన ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే చిరంజీవి నిజానికైతే కమర్షియల్ సినిమా చేయాలి. కానీ ఈ ఏజ్ లో కొన్ని ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేద్దామనే ఉద్దేశ్యంతోనే తను ఈ ప్రాజెక్టును ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక 70 సంవత్సరాలకు దగ్గరలో ఉన్న చిరంజీవి ఇప్పుడు కూడా చాలా సాహసోపేతమైన సినిమాలు చేస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా క్లైమాక్స్ లో చిరంజీవి ఒక ఆపదలో ఇరుక్కుంటాడట. ఇక అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి అతన్ని సేవ్ చేసి మళ్లీ ముందుకు పంపించే క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఇది కనక నిజమైతే థియేటర్లలో మెగా అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీలో ఉన్నాడు. ఎలక్షన్స్ ముగిసిన కూడా రిజల్ట్ కోసం ఇంకో 20 రోజులపాటు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.

కాబట్టి అన్ని ముగిసిన తర్వాత విశ్వంభర సినిమాకు సంబంధించిన షూట్ లో పవన్ కళ్యాణ్ రెండు రోజులు పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక తర్వాత ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా బిజీ అవ్వబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…