Sitara
Sitara: మహేష్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరో. మహేష్ తో పాటు ఆయన కుటుంబంలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వం నిలబెడుతూ మహేష్ బాబు దేశం మెచ్చిన హీరోల్లో ఒకరిగా ఎదిగారు. మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఒకప్పటి హీరోయిన్. ప్రస్తుతం మహేష్ బాబు సలహాదారుగా, బిజినెస్ ఉమన్ గా బాధ్యతలు నెరవేరుస్తుంది. వీరికి గౌతమ్, సితార సంతానంగా ఉన్నారు. మహేష్ కొడుకు గౌతమ్ సోషల్ మీడియాలో సైలెంట్. సితార మాత్రం చిచ్చర పిడుగు.
సితార ఘట్టమనేని తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకుంది. అతిచిన్న ప్రాయం నుండే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సితారకు యూట్యూబ్ ఛానల్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి. ఇంస్టాగ్రామ్ లో తరచుగా తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మోడలింగ్ లో అడుగుపెట్టింది. ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కి సితార ప్రచార కర్తగా వ్యవహరించింది.
అందుకు గాను సదరు జ్యువెలరీ సంస్థ సితారకు రూ. 1 కోటి చెల్లించారట. కేవలం పదేళ్ల ప్రాయంలో సితార కోట్లు సంపాదించడం ఆమె ప్రతిభకు నిదర్శనం. సితార యాడ్ ని ప్రఖ్యాత న్యూ యార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో ప్రదర్శించడం మరొక విశేషం. ఇలా చెప్పుకుంటూ పోతే సితార సాధించిన విజయాలు చాలానే ఉన్నాయి. ఆమె సోషల్ వర్కర్ కూడాను. తనకు యాడ్ ద్వారా వచ్చిన డబ్బులతో అనాథ బాలికలకు సైకిల్స్ దానం చేసింది.
ఇన్ని అరుదైన మైలురాళ్ళు అందుకుంటున్న సితార వయసు కేవలం 12 ఏళ్ళు మాత్రమే. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సితారను మరొక పాప… సితార అక్క ఇప్పుడు మీరేమి చదువుతున్నారు? అని అడిగింది. దానికి సితార సమాధానంగా… నేను 6వ తరగతి పూర్తి చేశాను. నెక్స్ట్ 7వ తరగతిలోకి వెళుతున్నాను, అని అన్నారు. తిరిగి ఆ పాప ఏం చదువుతుందో అడిగి తెలుసుకుంది సితార. ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా సితార డాన్స్ కూడా నేర్చుకుంటుంది.
Sitara studing 7th class
And the cute little baby is now UKG pic.twitter.com/OQayOVqB2Z— . (@VizagMaheshfans) May 24, 2024
Web Title: Do you know what mahesh babu daughter sitara is studying now
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com