Kannappa: కన్నప్ప సినిమాలో రజినీకాంత్ నటించకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

Kannappa: కెరియర్ స్టార్టింగ్ లో విలన్ గా నటించిన మోహన్ బాబు ఆ తర్వాత కామెడీ విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల పాత్రలను పోషించి తన ఎంటైర్ కెరియర్ లో 500 పైన సినిమాల్లో నటించి మెప్పించడమే కాకుండా...

Written By: Gopi, Updated On : July 5, 2024 10:15 am

Why Rajinikanth did not act in Kannappa movie

Follow us on

Kannappa: సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటులుగా పేరు సంపాదించుకున్న వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. ఇక వాళ్ళు ఎలాంటి పాత్రనైనా సరే అలావోకగా చేసి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ హీరోలుగా, విలన్లుగా మాత్రమే చేయగలిగితే వీళ్ళు మాత్రం అన్ని రకాల పాత్రలను పోషించగలుగుతారు.

ఇక అలాంటి వాళ్ళలో మోహన్ బాబు ముందు వరుసలో ఉంటాడు. కెరియర్ స్టార్టింగ్ లో విలన్ గా నటించిన మోహన్ బాబు ఆ తర్వాత కామెడీ విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల పాత్రలను పోషించి తన ఎంటైర్ కెరియర్ లో 500 పైన సినిమాల్లో నటించి మెప్పించడమే కాకుండా ఇప్పటికీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే మోహన్ బాబు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే. అయినప్పటికీ మోహన్ బాబు కొడుకు అయిన విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘కన్నప్ప ‘ సినిమాలో ఎందుకు నటించడం లేదు అనే వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

నిజానికి కన్నప్ప సినిమాలో దేశంలో ఉన్న టాప్ నటులందరితో నటింపజేస్తున్నారు. మరి అలాంటప్పుడు రజనీకాంత్ లాంటి నటుడుని ఎందుకు వాళ్ళ సినిమాలో తీసుకోలేదు అనే అనుమానులైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మోహన్ బాబు చేయాల్సిన క్యారెక్టర్ ని రజనీకాంత్ చేత చేయిద్దామని అనుకున్నాడట. కానీ రజినీకాంత్ కి ప్రస్తుతం ఉన్న కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అలాంటి ఒక వైల్డ్ క్యారెక్టర్ ని పోషించలేనని చెప్పడంతో ఆ క్యారెక్టర్ కి మోహన్ లాల్ ను తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది.

లేకపోతే కన్నప్ప సినిమాలో రజనీకాంత్ ని కూడా మనం చూసి ఉండే వాళ్ళమని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…ఇక కన్నప్ప మీదనే భారీ ఆశలు పెట్టుకున్న విష్ణు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…