Anchor Jahnavi: యాంకర్ గా మారి స్టార్ హీరోయిన్లు అయిన వారు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. కొందరు హీరోయిన్లు కాకపోయినా వివిధ పాత్రల్లో ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు టీవీ యాంకర్ కు ప్రత్యేక గుర్తింపు ఉండేది. వీరు కొన్ని షో ల్లో మాత్రమే కనిపించడం వల్ల వారి ఇమేజ్ పాపులర్ అయ్యేది. అలాంటి వారిలో జాహ్నవి ఒకరు. ‘డ్యాన్స్ బేబీ డ్యాన్స్’ షోతో గుర్తింపు తెచ్చుకున్న జాహ్నవి అప్పటి ఉదయభాను, సుమ లాంటి వారికి గట్టి పోటీ ఇచ్చింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించిన జాహ్నవి క్రమంగా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం జాహ్నవి ఏం చేస్తుందో తెలుసా?
టీవీ షో లో ఒకప్పుడు తక్కువగా ఉండేవి. దీంతో కొందరు యాంకర్ గా తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ‘టాక్ ఆఫ్ ది టౌన్’ తో ఉదయబాను.. ‘పట్టుకుంటే పట్టుచీర’ తో సుమ పాపులర్ యాంకర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే సమయంలో జెమినీ టీవీలో వచ్చిన ‘డ్యాన్స్ బేబీ డ్యాన్స్’షో లో యాంకర్ గా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్న జాహ్నవి.. కొద్ది కాలంలోనే పాపులర్ అయ్యారు. ఆ తరువాత పలు షో ల్లో నటించారు.
అయితే క్రమంగా జాహ్నవికి సినిమాల్లో అవకాశాలు రావడం ప్రారంభం అయింది. గోపీచంద్ హీరోగా వచ్చిన యజక్ఓం సినిమాలో జాహ్నవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన ఈమె ముస్లిం యువతిగా కనిపించి తన నటనా విశ్వరూపాన్ని చూపించారు. ఆ తరువాత ఒకరికి ఒకరు సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించారు. ఇందులో రైలులో చిన్న పాత్రలో నటించిన జాహ్నవి ఆ తరువాత మళ్లీ కనిపించదు.
‘ఒకరికి ఒకరు’ సినిమాను రసూల్ ఎల్లోరి డైరెక్షన్ చేశారు. ఈ సమయంలోనే జాహ్నవితో ప్రేమలో పడ్డారు. ఆ తరువాత వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నారు. రసూల్ ఎల్లోరి ‘భగీరథ’ అనే మూవీని కూడా తీసిన విషయం తెలిసిందే. ఆ తరువాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. అయితే జాహ్నవి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ‘ఎవరు’ అనే సినిమాలో రెజీనాకు డ్రెస్ డిజైనింగ్ చేసినట్లు సమాచారం. అయితే సినిమాల్లో నటిస్తారా? అని కొందరు అడిగిన ప్రశ్నకు జాహ్నవి సమాధానం చెప్పడం లేదు.