https://oktelugu.com/

YVS Chowdary: డైరెక్టర్ వైవిఎస్ చౌదరీ భార్య ఓ స్టార్ హీరోయిన్.. ఆమె ఎలా ఉంటుందో తెలుసా..?

కృష్ణవంశీ చేసిన సింధూరం సినిమాకి కూడా వైవిఎస్ చౌదరి తన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మెలుకువలు నేర్చుకొని ఆ తర్వాత వెంకట్ ని హీరోగా పెట్టి 'సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి' అనే సినిమా చేశాడు.

Written By:
  • Gopi
  • , Updated On : March 28, 2024 / 02:01 PM IST

    Director YVS Chaudhary wife is a star heroine

    Follow us on

    YVS Chowdary: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కృష్ణవంశీ లాంటి దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈయన నాగార్జునతో చేసిన నిన్నే పెళ్ళాడుతా సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమా సమయంలో వైవిఎస్ చౌదరి కృష్ణవంశీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు. ఈ సినిమా సూప్ హిట్ అవ్వడం తో ఆ తర్వాత కృష్ణవంశీ చేసిన సింధూరం సినిమాకి కూడా వైవిఎస్ చౌదరి తన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మెలుకువలు నేర్చుకొని ఆ తర్వాత వెంకట్ ని హీరోగా పెట్టి ‘సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి’ అనే సినిమా చేశాడు.

    ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత నాగార్జునతో ‘సీతారామ రాజు’ అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే సింధూరం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి నటి గా మంచి గుర్తింపు సంపాదించుకున్న గీత ను లవ్ చేశాడు.ఆ సినిమా సమయం నుంచే వైవిఎస్ చౌదరి కి అనే మీద ప్రేమ ఉండేది. ఇక అందులో భాగంగానే తనను పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక ఆయన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి ఆమె ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

    ఇక ప్రస్తుతం వైవిఎస్ చౌదరి వరుస ప్లాపు ల్లో ఉండి ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోయాడు. మళ్లీ ఒక సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో మరో సక్సెస్ ని కూడా తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక వై వీ ఎస్ చౌదరి కెరియర్ లో మంచి విజయాలు ఉన్నాయి. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకొని డైరెక్టర్ గా ఆయనకి ఒక మంచి గుర్తింపునైతే తీసుకొచ్చాయి.

    కానీ మధ్యలో వచ్చిన కొన్ని ప్లాప్ సినిమాల వల్ల ఆయన సినిమా కెరియర్ అనేది భారీగా డౌన్ అయిపోయింది… దానివల్లే ఇప్పుడు నందమూరి జానకి రామ్ కొడుకుని హీరోగా పరిచయం చేసే పనిలో తను బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాతో కనక సక్సెస్ సాధిస్తే మరోసారి తను ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు…