Raaka makers sensational decision: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన ద్రుష్టి మొత్తం ‘రాకా’ చిత్రం మీదనే పెట్టాడు. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వచ్చే నెల తో పూర్తి అవ్వాలి. కానీ డైరెక్టర్ అట్లీ అత్యధిక సన్నివేశాలను రీ షూట్ చేసే పరిస్థితి రావడం తో కుదర్లేదు. కనీసం ఈ ఏడాది లోపు అయినా పూర్తి అవుతుందా అంటే అనుమానమే. రీసెంట్ గానే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. ఫస్ట్ లుక్ సంగతి పక్కన పెడితే , ఈ చిత్రాన్ని అన్ని విధాలుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి ఏ మాత్రం తగ్గిపోకుండా తీస్తున్నాడట డైరెక్టర్ అట్లీ. త్వరలోనే గ్లింప్స్ వీడియో ని కూడా విడుదల చేయబోతున్నారట.
ఇది కాసేపు పక్కన పెడితే మూవీ టీం ఈ చిత్రానికి సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో అల్లు అర్జున్ కి అనేక మ్యానరిజమ్స్ , సిగ్నేచర్ స్టెప్పులు ఉంటాయట. వాటిని ఎవ్వరూ అనుకరించకుండా , భద్రతా కల్పించే ఆలోచన లో ఉన్నారట. అంటే సోషల్ మీడియా లో ఎవ్వరూ కూడా ఆ సిగ్నేచర్ మూమెంట్స్ ని కానీ , మ్యానరిజమ్స్ ని అనుకరిస్తూ రీల్స్ , షార్ట్స్ వంటివి చెయ్యకూడదు అన్నమాట, ఒకవేళ చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. అంటే సింపుల్ గా మీకు అర్థం అయ్యే భాషలో చెప్పాలంటే అరెస్ట్ కూడా అవ్వొచ్చు అన్నమాట. ఈ మ్యానరిజమ్స్ ని , సిగ్నేచర్ స్టెప్స్ ని ఎక్సక్లూసివ్ గా ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
‘పుష్ప’ చిత్రానికి నార్త్ ఇండియా లో ఆ రేంజ్ క్రేజ్ ఏర్పడడానికి ముఖ్య కారణం ఇన్ స్టాగ్రామ్ లో ఆ చిత్రం లోని పాటలకు నెటిజెన్స్ రీల్స్ చేయడం వల్లే . అంతే కాదు , చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు కూడా ‘తగ్గేదేలే ‘ మ్యానరిజమ్స్ చేశారు. అందుకే ఆ సినిమాకు ఆ రేంజ్ రీచ్ వచ్చింది, సీక్వెల్ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించడానికి కారణమైంది. కానీ ‘రాకా’ కి అలా జరగకుండా చూస్తున్నారు మేకర్స్. ఇదొక సరికొత్త ప్రయోగం అనే చెప్పాలి. మరి ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి , ఒకవేళ పొరపాటున బ్యాక్ ఫైర్ అయితే మాత్రం సినిమా ఫలితం పై ప్రభావం పడే అవకాశాలు కూడా లేకపోలేదు , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.