Tollywood Marriages
Tollywood Marriages: టాలీవుడ్ కు పెళ్లి కళ వచ్చింది. ఇండస్ట్రీలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన వారు, వారి కూతుళ్ల వివాహాలతో సందడిగా మారనుంది. మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి నవంబర్ 1న జరగనుంది. ఇందుకోసం ఇరు ఫ్యామిలీలు ఇప్పటికే ఇటలీ బయలు దేరింది. మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్యలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆ తరువాత పెద్దలను ఒప్పించి జూన్ 9న నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. నవంబర్ 5న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
సీనియర్ హీరో వెంకటేష్ చిన్న కూతురు హవ్వవాహిని వివాహ నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఈ వేడుకకు అతికొద్ది మంది సినీ సెలబ్రెటీలు మాత్రమే హాజరయ్యారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు సందడి చేశారు. త్వరలో వెంకటేష్ చిన్న కూతురు హవ్వవాహిని వివాహం నిర్వహించనున్నారు. విజయవాడకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ కూతురుతో వెంకీ వియ్యమందుకున్నారు.
తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆయన సోదరుడు సురేష్ కూమారుడు ఆశిష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే ఆయన ఎవరో కాదు ‘రౌడీ బాయ్స్’ అనే సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. త్వరలో సెల్ఫీ అనే సినిమాతో రాబోతున్నాడు. దిల్ రాజు కుటుంబం ఏపీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో వియ్యం అందుకుంటున్నట్లు సమాచారం.
అటు టాలీవుడ్ సీనియర్ హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య సర్జా వివాహ నిశ్చితార్థం శుక్రవారం చెన్నైలో నిర్వహించారు. అయితే పెద్ద ఆడంబరం లేకుండా సింపుల్ గా నిర్వహించారు. ఐశ్వర్య సర్జాను ప్రముఖ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యను ప్రేమించింది. ఆ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. ఐశ్వర్య సర్జా ‘పట్టుట్ట యానై’ అనే సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చారు.