https://oktelugu.com/

Anupama Parameswaran: ఇతర హీరోయిన్ లకు భిన్నంగా అనుపమా పరమేశ్వరన్.. ఈమె చేసే పని అదేనట

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుపమా తరచూ తన ఫోటోలను పంచుకుంటుంది. కానీ ఎక్కువగా అనుపమా చీర కట్టుకొని, పూలు పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని కనిపిస్తుంటుంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 28, 2023 / 01:39 PM IST

    Anupama Parameswaran

    Follow us on

    Anupama Parameswaran: టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మలయాళీ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈమె నటన, అందంతో ఆకట్టుకోవడమే కాదు అచ్చ తెలుగు అమ్మాయిలాగా ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసుకుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ అమ్మడు ఇతర హీరోయిన్ లతో పోలిస్తే కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి. ఎందుకంటారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే..

    సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుపమా తరచూ తన ఫోటోలను పంచుకుంటుంది. కానీ ఎక్కువగా అనుపమా చీర కట్టుకొని, పూలు పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని కనిపిస్తుంటుంది. హీరోయిన్ అయినా కూడా పాశ్చాత్య సంస్కృతి కంటే పద్దతిగా కనిపిస్తూ అందరిని ఆకట్టుకోవడంలో అందరికంటే ఒక అడుగు ముందే ఉంటుంది ఈ అమ్మడు. సంస్కృతి సంప్రదాయాలను పాటించడంలో ముందుంటుంది కూడా. దీంతో ఏ హీరోయిన్ కూడా ఇంత పద్దతిగా ఇలా కనిపించలేదు. కానీ ఎక్కువ సార్లు ట్రెడీషనల్ కే ఓటు వేస్తూ.. వెస్టన్ కల్చర్ కి కాస్త తక్కువ ప్రిపరెన్స్ ఇచ్చే మా అను అంటే మాకు ఇష్టం అంటూ కామెంట్లు చేస్తుంటారు ఆమె అభిమానులు.

    ఇలా తెలుగు అమ్మాయిలా, పద్దతిగా కనిపించడంతో..ఎంతో మంది తెలుగు హీరోయిన్స్ లో లేనటువంటి క్వాలిటీ అనుపమలో ఉన్నదనే కామెంట్స్ చేస్తుంటారు నెటిజన్లు. అయితే ఇతర హీరోయిన్స్ ఇలా కనిపించరా అనే ప్రశ్న కూడా ఎదురవుతుంది. కానీ పండుగలకు లేదా స్పెషల్ వేడుకలకు తప్ప పెద్దగా చీరల్లో, పద్దతిగా కనిపించరు. కానీ అనుపమా మాత్రం ఎక్కువగా ట్రెడీషనల్ గా కనిపిస్తుంటుంది. అంతేకాదు సినిమాల్లో నటించేటప్పుడు కూడా డైరెక్టర్లు ఎక్స్ పోజింగ్ గురించి చెబితే.. అది ఎంత వరకు కరెక్ట్, సినిమాకు సూట్ అవుతుందా? లేదా? దాని వల్ల తనకు ఏమైనా నష్టమా వంటివి ఆలోచించుకొని మరీ షూట్ లోకి ఎంట్రీ ఇస్తుందట ఈ బ్యూటీ. దీంతో అందరు వేరు మా అను వేరు అంటున్నారు ఆమె అభిమానులు.