Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 లో ఆట సందీప్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. మొదటి వారంలో పవర్ అస్త్ర సాధించి ఇంటి సభ్యుడు అయ్యాడు.ఐదు వారాల ఇమ్యూనిటీ పొందాడు. ముందు నుంచే టాస్కుల్లో తన సత్తా చూపిస్తున్నాడు. స్టార్ మా లో ప్రసారమైన’ నీతోనే డాన్స్’ అనే షోలో తన భార్యతో కలిసి పార్టిసిపేట్ చేశాడు.డాన్స్ షో లో విన్నర్ గా నిలిచారు సందీప్ -జ్యోతి రాజ్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ కు హాజరైన జ్యోతి రాజ్ సందీప్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.
తమపై పల్లవి ప్రశాంత్ సపోర్టర్స్ చేస్తున్న ట్రోల్స్ పై స్పందించారు. జ్యోతి రాజ్ మాట్లాడుతూ ..’ రియాలిటీ షో ఆయనకేం కొత్త కాదు. ఒక్కసారి దిగారంటే కప్పు కొట్టాల్సిందే. బిగ్ బాస్ అనేది ఒక కొత్త అనుభవం. డాన్స్ వేరు.. రియాలిటీ షో వేరు. సందీప్ ఎవరితోనైనా కలవడానికి కాస్త టైం తీసుకుంటారు. అతను ఇంట్రావర్ట్. మాకు ఒక డ్రీమ్ ఉంది. అందుకోసమే బిగ్ బాస్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నాం అని చెప్పింది జ్యోతి.
సందీప్ ఫైనల్ గా పెద్ద హీరోలతో కొరియోగ్రఫీ చేయాలన్నదే ఆశయం అని అన్నారు. తన భర్త పై వస్తున్న నెగిటివ్ ట్రోల్స్ పై స్పందించింది. ‘ప్రశాంత్ కు వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు ఇంకా చెడగొడుతున్నారు. మమ్మల్ని చాలా హర్ట్ చేస్తున్నారు. మా పై అసభ్యకరంగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇందులో ఫ్యామిలీ ని లాగడం మంచిదేనా అంటూ నేను ఒక వీడియో పెట్టాను. అందుకు నీ మొగుడు వెస్ట్ అంటూ చెప్పుకోలేని మాటలు అన్నారు.
ప్రశాంత్ తో పెట్టుకుంటే మాములుగా ఉండదు. ప్రశాంత్ జోలికొస్తే మిమ్మల్ని వదలం. నీ మొగుడికి చెప్పు .. ప్రశాంత్ జోలికి రావద్దని.ఇంకా చెప్పుకోలేని మాటలు అన్నారు అంటూ జ్యోతి ఎమోషనల్ అయింది. దీనివల్ల ఎవరికి చెడ్డ పేరు. తమ్ముడు ప్రశాంత్ కే కదా. అతను లోపలికి వెళ్ళేటప్పుడు నాకు సపోర్ట్ చెయ్యండి అని చెప్పేసి వెళ్ళాడు. కానీ వీళ్లంతా కలిసి వాడిని ఎలిమినేట్ చేసేలా ఉన్నారు.వీళ్లంతా కలిసి ప్రశాంత్ కి బ్యాడ్ నేమ్ తెస్తున్నారు అని చెప్పుకొచ్చింది జ్యోతి రాజ్.