Chiranjeevi vs Prabhas fans: సోషల్ మీడియా లో గత రెండు రోజులుగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే రీసెంట్ గానే హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి సంబంధించిన సక్సెస్ ఈవెంట్ జరిగింది. ఈ సక్సెస్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ ‘నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సంక్రాంతికి విడుదలయ్యే ప్రతీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నాను. నేను కోరినట్టే ఒకటి, రెండు సినిమాలు తప్ప అన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి’ అని అన్నాడు. దీనికి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. వాళ్ళ అభిమాన హీరో నటించిన ‘రాజా సాబ్’ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.
ఆ కారణం చేత చిరంజీవి ప్రభాస్ ‘రాజా సాబ్’ ని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేసాడని, చిరంజీవి కి ప్రభాస్ అంటే మొదటి నుండి అసూయ నే అని, గతం లో ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రానికి కూడా చిరంజీవి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడని, ప్రభాస్ మెగా హీరోలకంటే టాప్ రేంజ్ లో ఉండడం చిరంజీవి నచ్చడం లేదని, ఇలా రకరకాల కామెంట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ గత రెండు రోజులుగా ట్విట్టర్ ద్వారా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మెగా ఫ్యాన్స్ కూడా చాలా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. చిరంజీవి గారు కావాలని ప్రభాస్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ కాదు, ఎదో ఫ్లో లో మాట్లాడిన మాటలు అని చిరంజీవి ఆరోజు మాట్లాడిన విధానాన్ని చూసే చెప్పొచ్చని, కావాలని గొడవలు పెట్టుకోవాలని చిరంజీవి ని కించపరుస్తూ మాట్లాడితే చూస్తూ ఊరుకోము అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు.
అయితే వాస్తవానికి మెగా ఫ్యాన్స్ చెప్పిన దాంట్లో అర్థం ఉంది. ఎదో ఫ్లో లో చిరంజీవి ఆరోజు రాత్రి అలా మాట్లాడినట్టు అనిపించిందే కానీ ,ప్రభాస్ ని తక్కువ చేసే ఉద్దేశ్యం కనిపించలేదు. చిరంజీవి కుటుంబానికి ప్రభాస్ అత్యంత సన్నిహితుడు. ముఖ్యంగా రామ్ చరణ్ తో ప్రభాస్ కి ఉన్నటువంటి సాన్నిహిత్యం సొంత అన్నదమ్ములు లాంటిది. ప్రభాస్ పెద్దనాన్న కృషంరాజు కి కాళ్ళ ఆపరేషన్ జరిగినప్పుడు అపోలో హాస్పిటల్ లో ఉపాసన తన సొంత తండ్రిని చూసుకున్నట్టు చూసుకుంది అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాదు కెరీర్ ప్రారంభం నుండి ప్రభాస్ కి ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అందిసునే వచ్చాడు చిరంజీవి. కాబట్టి ఆయనకు ప్రభాస్ మీద ఆయనకు అసూయ ఉంది అంటున్న వస్తున్న వార్తలు కేవలం అపోహలు మాత్రమే అని అంటున్నారు విశ్లేషకులు .