Peddi vs Ustaad Bhagat Singh: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) మూవీ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియా లో గత కొద్దిరోజులుగా పెద్ద రచ్చ జరుగుతోంది. ముందుగా మేకర్స్ ఈ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27 న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. కానీ ఆ తేదికి విడుదల అవ్వడం కష్టమని, సినిమా షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉందని, మే1 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ తేదీలో కూడా ఈ చిత్రం విడుదల అవ్వడం అసాధ్యమట. కారణం ఈ సినిమాకు సంబంధించి ఇంకా రెండు నెలల పాటు షూటింగ్ బ్యాలన్స్ ఉందట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి కూడా చాలా సమయం పట్టేలా ఉందని, కాబట్టి ఈ చిత్రం నేరుగా ఆగష్టు, లేదా దసరా కానుకగా విడుదల అవ్వొచ్చని అంటున్నారు.
ప్రస్తుతం ఈ విషయం పైనే మేకర్స్ చర్చలు జరుపుతున్నారట. పెద్ది చిత్రం మార్చి 27 న రాకుంటే, ఆ సినిమా స్థానం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని విడుదల చెయ్యాలని చూస్తున్నారట. ఎందుకంటే ఈ రెండు సినిమాలకు ఒక్కరే నిర్మాత. ఒకవేళ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 26 న విడుదల చెయ్యాలని అనుకుంటే, కేవలం రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ రెండు నెలల్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్, లిరికల్ వీడియో సాంగ్స్, ఈవెంట్స్ ఇవన్నీ చేయడానికి సమయం కావాలంటే ముందుగా విడుదల తేదీని ప్రకటించాలి. పెద్ది చిత్రాన్ని వాయిదా వేస్తున్నాము అని చెప్పిన తర్వాతే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీని ప్రకటించాలి కాబట్టి, ఫిబ్రవరి మొదటి వారం లోనే ‘పెద్ది’ వాయిదా వ్యవహారంపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
మరో వైపు రామ్ చరణ్ ఫ్యాన్స్ లో మేకర్స్ పై తీవ్రమైన అసంతృప్తి ఏర్పడింది. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రమిది, ట్రేడ్ లో కూడా చాలా కాలం తర్వాత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న రామ్ చరణ్ సినిమా ఇదే. పాన్ ఇండియా లెవెల్ లో కుంభస్థలం బద్దలు కొట్టాలనే కసితో మేమంటే, ఇలా వాయిదా వేయడం వల్ల మా ఉత్సాహం పై నీళ్లు చల్లుతున్నారు అంటూ మేకర్స్ ని ట్యాగ్ చేసి ఒక రేంజ్ లో ఏకిపారేస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. అయితే ఆలస్యం అయినా ఈసారి మంచి విడుదల తేదీని ప్రకటించమని మరికొంతమంది అభిమానులు అడుగుతున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.