Alitho Saradaga: ఈ మధ్య కాలంలో బుల్లి తెర పై ఉన్న టాక్ షో లలో క్రేజీ టాక్ షో గా పేరు పొందింది మాత్రం ‘అలీ తో సరదాగా’. టాలీవుడ్ కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ఈ షో ని జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. కొత్త – పాత, చిన్నా- పెద్దా, వెండితెర – బుల్లితెర అని తేడా లేకుండా ప్రతి ఒక్క సెలబ్రిటీ ని పిలిచి సరదాగా ప్రేక్షకులకి తెలియని ముచ్చట్లు పంచిపెడుతున్నారు.

ఈ షో హిట్టవ్వడానికి గల కారణాలు ముఖ్యంగా మూడు. ఒకటి కమెడియన్ అలీ ని వ్యాఖ్యాత గా ఎంచుకోవడం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ లో ప్రతి ఒక్క నటుడి తో మంచి అనుబంధం కలిగి ఉండటం. అంతే కాకుండా ఆలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎప్పటి నుండో సినిమా లో స్థిరపడ్డారు. అలా సినిమాతో ప్రయాణం చెయ్యడం వలన సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం తెలుసు. అలా ప్రతి ఒక్కరితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి అలీ… వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు కాబట్టే ఈ షో హిట్టవడానికి ప్రథమ కారణం.
రెండోది ఏంటంటే… సంవత్సరాలు తరబడి తెర మరుగు పడి ఉన్న నటి నటుల్ని వెతికి తీసి, మళ్ళీ తెరపైకి తీసుకు రావడం. ఎందుకంటే చాలా మందికి తమ ఫేవరెట్ నటులు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో అనే విషయం తెలుసుకోవడం అనేది చాలా ఆసక్తి తో కూడుకున్న విషయం. కేవలం వాళ్ళ కోసం అయిన షో ని వీక్షించే ప్రేక్షకులు చాలా మంది.
మూడో విషయం ఏంటంటే… జరిగిన ప్రతి ఎపిసోడ్, ప్రోమో ని ప్రేక్షకులకి అందుబాటులోకి తీసుకు రావడం. ఎందుకంటే… ప్రతి ఒక్క టీవీ ఛానల్ కి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఛానల్ కి సమందించిన టీవీ సీరియల్స్ ని కానీ, ప్రోగ్రామ్స్ ని కానీ వాళ్ళ కి సంబంధించిన అప్లికేషన్ లో విడుదల చేస్తారు. అలా టీవీ లో కాకుండా మళ్ళీ చూడాలంటే ఆ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకొని దానిలో చూడాలి. మా టీవీ కి హాట్ స్టార్, జెమినీ టీవీ కి సన్ టీవీ, జీ తెలుగు జీ 5 అనే యాప్స్ ఉన్నాయి. ఈటీవీ కి కూడా యాప్ ఉన్నా సరే…. వాటికి సంబందించిన సీరియల్స్ ని, ప్రోగ్రామ్స్ ని యూట్యూబ్ లో విడుదల చేస్తుంది. యూట్యూబ్ ప్రతి ఒక్కరు వాడే యాప్ కాబట్టి అందరూ ఈ టీవీ కి సంబంధించిన కార్యక్రమాలన్ని యూట్యూబ్ లో నే వీక్షిస్తారు.
కానీ సడన్ గా ఏమయ్యిందో తెలియదు కానీ ఆలీతో సరదాగా కార్యక్రమం ఆపేసినట్లు తెలుస్తుంది. అంతకుముందే జరిగిపోయి, ప్రసారమయిన అన్నపూర్ణ – వై వి ఆర్ విజయ ల ఎపిసోడ్ ని మళ్ళీ సోమవారం పునర్ ప్రసారం చేయనున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆలీతో సరదాగా కార్యక్రమం ముగిసినట్లే అని భావించవచ్చు.