Bigg Boss Telugu: తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రతి ఏడాది 16 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభం అయ్యే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కోసం జనాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు..అయితే ఇటీవల కాలం లో OTT ని చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది..దీనితో ఎలా అయినా క్రేజ్ ని కాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యం తో ముందుగా బాలీవుడ్ వాళ్ళు బిగ్ బాస్ నాన్ స్టాప్ అని టెలివిషన్ లో కాకుండా OTT లో ప్లాన్ చేసారు..అక్కడ ఈ ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది..బుల్లితెర పై ఈ రియాలిటీ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో..OTT లో కూడా అదే స్థాయి లో విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది..వాళ్లనే ఫాలో అవుతూ మన తెలుగు లో కూడా ఇటీవలే బిగ్ బాస్ నాన్ స్టాప్ OTT ప్రోగ్రాం ని ప్రారంభించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో బిందు మాదవి టైటిల్ విన్నర్ గా నిలబడగా, అఖిల్ రన్నర్ గా నిలిచాడు.
Also Read: Pawan Kalyan: తన కొత్త సినిమా పై పవన్ కళ్యాణ్ అసంతృప్తి
అయితే తెలుగు లో ఈ బిగ్ బాస్ OTT రియాలిటీ షో పెద్దగా విజయం సాధించలేదు అనే చెప్పాలి..24 గంటలు OTT లో చూసే ఓపిక నెటిజెన్స్ కి లేదు అని..అందుకే ఈ షో అంత పెద్ద సక్సెస్ కాలేకపోయింది అని విశ్లేషకుల అభిప్రాయం..దీనితో బిగ్ బాస్ యాజమాన్యం ఇక నుండి బిగ్ బాస్ రియాలిటీ షో ని OTT లో ఆపివేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం..ఇక నుండి OTT లో బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఉండబోదు అని..కేవలం బుల్లితెర పై మాత్రమే బిగ్ బాస్ ఉంటుంది అని తెలుస్తుంది..టెలివిషన్ లో ఇప్పటికే 5 సీసన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో..అతి త్వరలోనే ఆరవ సీసన్ ని కూడా ప్రారంభించేందుకు సిద్ధం అయ్యింది అట..ఆగష్టు నెలలో కానీ, లేదా జులై చివరి వారం లో కానీ ఈ రియాలిటీ షో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..ఇప్పటి వరుకు టెలివిజన్ లో టెలికాస్ట్ అయినా ప్రతి ఒక్క సీసన్..ఒక్కదానిని మించి ఒక్కటి సూపర్ హిట్ అవుతూ వచ్చాయి..దీనితో ఆరవ సీసన్ పై అంచనాలు తారాస్థాయికి చేరింది..ఈ ఆరవ సీసన్ లో కంటెస్టెంట్స్ గా ఎవరు పాల్గొనబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ మారింది..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియచేయనున్నారు బిగ్ బాస్ టీం.
Also Read: Analysis on Punjab Model పంజాబ్ మోడల్ దేశానికి రోల్ మోడల్ కావాలి
Recommended videos