Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu-Taraka Ratna: మహేష్ కి బావగా నందమూరి హీరో.. ...

Mahesh Babu-Taraka Ratna: మహేష్ కి బావగా నందమూరి హీరో.. క్రేజీ కాంబినేషన్ !

Mahesh Babu-Taraka Ratna: సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. రీసెంట్ గానే త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ భారీ యాక్షన్ డ్రామాలో మరో కీలక పాత్ర ఉందని, ఆ పాత్రలో నందమూరి తారక రత్న నటిస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. సినిమాలో తారక రత్న పాత్ర విషయానికి వస్తే.. మహేష్ కి బావ పాత్ర అట. పైగా ది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అట.

Mahesh Babu-Taraka Ratna
Mahesh Babu

ఎప్పటి నుంచో తారక రత్న సైడ్ క్యారెక్టర్స్ కోసం పడిగాపులు కాస్తున్నాడు. కాకపోతే.. ఓ మంచి రోల్ కోసం ఇన్నాళ్లు ఎదురుచూశాడు. మరి, త్రివిక్రమ్ సినిమాలో సైడ్ క్యారెక్టర్ కి కూడా విలువ ఉంటుంది కాబట్టి.. తారక రత్నకి కాలం కలిసి వస్తోందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. జులై నుంచి షూట్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read: Pawan Kalyan: తన కొత్త సినిమా పై పవన్ కళ్యాణ్ అసంతృప్తి !

త్రివిక్రమ్ ఈ సినిమాలో యాక్షన్ అండ్ రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తామని, ఇది యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నాడు. పైగా ఈ సినిమాలో రెండు బలమైన నేపథ్యాలు కూడా ఉంటాయట. ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఒకటి కాగా, పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యం మరొకటి.

కానీ, ఈ యాక్షన్ డ్రామాని మహేష్ ఇష్టపడలేదు అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరి మహేష్ ఒప్పుకుంటాడా ? ఎలాగూ మాటలతో కన్విన్స్ చేయడం త్రివిక్రమ్ కి పెన్ తో పెట్టిన విద్య. మరి ఈ మాటల మాంత్రికుడు ఈసారి తన విద్యను ఎంతవరకు ప్రయోగిస్తాడో చూడాలి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడు.

Mahesh Babu-Taraka Ratna
Tarakratna

సంజయ్ ది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర. అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ను తీసుకోవాలని చూస్తున్నట్లు త్త్రివిక్రమ్ సన్నిహితుల దగ్గర నుండి అందుతున్న సమాచారం. మరో కథానాయికగా పూజా హెగ్డేనే తీసుకోవాలని త్రివిక్రమ్ ఆశ పడుతున్న వ్యవహారం గురించి తెలిసిందే.

ఏది ఏమైనా త్రివిక్రమ్ పై నిర్మాతలకు నమ్మకం ఎక్కువ. పైగా మహేష్ బాబు హీరో అంటే.. ఇక ఆ సినిమాకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాకు రూ. 200 కోట్లు మినిమం బడ్జెట్‌ అయిపోయింది. ఎలాగూ మహేష్‌ రెమ్యునరేషన్‌ రూ. 60 కోట్లు వరకు ఉంటుంది. మరోపక్క అల వైకుంఠపురములో.., భీమ్లా నాయక్‌ తో త్రివిక్రమ్‌ కూడా తన రెమ్యునరేషన్ ను పెంచేశాడు.

ఈ లెక్కన సినిమాకి రూ.250 కోట్లు కనీస బడ్జెట్ అయ్యేలా ఉంది. అన్నిటికి మించి ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది.

Also Read: Mahesh Babu Copying Titles: తన సినిమా టైటిల్ ని తానే కాపీ కొడుతున్న మహేష్ బాబు
Recommended videos
Adivi Sesh Goes Down At His Knees To Respect A  Commando Shivraj || Major Movie Screening
Anchor Vishnu Priya Mind Blowing Dance || Vishnu Priya Latest Dance Video || Oktelugu Entertainment
Sonali Bendre Looks So Damn Beautiful || Karan Johar Birthday Party || Sonali Bendre Latest Video

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version