Bigg Boss Devi: బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో అరాచకానికి పాల్పడింది. బోల్డ్ ఫోజులకు తోడు క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేసింది. దివి టెప్టింగ్ ఫోటో షూట్ ప్రకంపనలు రేపుతోంది. తెలుగు బ్యూటీ దివి కెరీర్ గాడిన పడింది. గతంతో పోల్చితే ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కొన్ని ప్రాజెక్ట్స్ లో లీడ్ రోల్స్ కూడా దక్కుతున్నాయి. పేరున్న హీరోల చిత్రాల్లో కీలక రోల్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఆమెకంటూ ఇమేజ్ ఏర్పడింది. టాలీవుడ్ బడా ప్రాజెక్ట్స్ లో ఒకటైన పుష్ప 2లో దివి నటిస్తున్నారు. సుకుమార్-బన్నీల ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో దివి రిపోర్టర్ రోల్ చేస్తున్నారు.
పుష్ప 2లో దివి పాత్ర కీలకంగా కనిపిస్తుంది. అలాగే ఆమెకు స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పుష్ప 2తో దివి ఇమేజ్ మరో స్థాయికి చేరే అవకాశం కలదు. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన ‘వేర్ ఈజ్ పుష్ప?’ కాన్సెప్ట్ టీజర్లో దివి క్యారెక్టర్ హైలెట్ అయ్యింది. పుష్ప 2తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.
గత ఏడాది పలు ప్రాజెక్ట్స్ లో దివి నటించారు. హీరో విష్ణు నటించిన జిన్నా చిత్రంలో దివి ప్రాధాన్యత ఉన్న పాత్ర చేశారు. హీరో ఫ్రెండ్ పాత్రలో అలరించింది. మూగ అమ్మాయిగా నటించి మెప్పించింది. అలాగే బిగ్ బాస్ ఫేమ్ సన్నీ, సుబ్బరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ఏటీఎం’లో దివి నటించారు. ఆమెకు మంచి పాత్రలు దక్కుతున్నప్పటికీ హీరోయిన్ గా ఎదగాలని, స్టార్ కావాలని ఆశ పడుతోంది.
దివి బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్నారు. ఆ షోతో దివి వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు దివి గురించి తెలిసింది తక్కువే. నాగార్జున హోస్ట్ గా సాగిన సీజన్ 4లో దివి పెద్దగా రాణించలేదు. దివి సెటిల్డ్ గా ఉండేవారు. దివి ఎఫైర్స్ జోలికి పోలేదు. అలాగే స్కిన్ షో చేయలేదు. బిగ్ బాస్ షోలో కాంట్రవర్సీ చేసే వాళ్ళకే స్థానం ఉంటుంది. అందులోనూ దివి కొందరితో మాత్రమే స్నేహం చేసేవారు. అది కూడా ఆమెకు మైనస్ అయ్యింది. 7వ వారం దివి ఎలిమినేట్ అయ్యారు.
ఇక దివి సోషల్ మీడియా వేదికగా పాపులారిటీ తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ టూ బోల్డ్ గా ఉంది. చీర తీసేసి నాభి చూపిస్తూ నేలపై పడుకుంది. చూడగానే ప్రేమ కలగకపోతే అది ప్రేమే కాదంటూ ఓ క్రేజీ కామెంట్స్ ఆ ఫోటోలకు జోడించింది. దివి గ్లామరస్ ఫోటోల మీద నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.