Bigg Boss 6 Telugu 7th Week Elimination: బిగ్ బాస్ సీసన్ 6 ఇప్పుడు ఎవ్వరు ఊహించని మలుపులతో ,ఆసక్తికరమైన టాస్కులతో ముందుకి దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పటికి 6 వారాలు పూర్తి చేసుకొని 7 వ వారం లోకి అడుగుపెట్టిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఈ వారం ఇంటి నుండి బయటకి ఎవ్వరు వెళ్ళబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది..ఈ వారం నామినేషన్స్ ఇనాయ సుల్తానా, రోహిత్, మెరీనా, రేవంత్ , శ్రీహన్, కీర్తి , శ్రీ సత్య , ఫైమా, వాసంతి , అర్జున్ కళ్యాణ్ , ఆది రెడ్డి , రాజ్ శేఖర్ ,ఆదిత్య ఉన్నారు.

వీరిలో ఎప్పటి లాగానే రేవంత్ అందరికంటే అత్యధిక ఓట్లతో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతుండగా,శ్రీహాన్ మరియు అర్జున్ రెండు , మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు..గత వారం డేంజర్ జోన్ లో ఉన్న బాలాదిత్య ఈ వారం టాప్ 4 లో కొనసాగుతున్నాడు..ఇక మిగిలిన ఇంటి సభ్యులందరు ఓట్ల ర్యాంకింగ్ పరంగా మధ్యలో ఉండగా డేంజర్ జోన్ లో రోహిత్ – మెరీనా ఉన్నట్లు తెలుస్తుంది.
కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందే అవకాశం ఉందని తెలుస్తుంది..వోటింగ్ ప్రకారం అందరికంటే చివరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నది మెరీనా మరియు రోహిత్ అని..భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎలా అయితే కలిసి జంటగా హౌస్ లోకి అడుగుపెట్టారో..అలాగే బయటకి కూడా కలిసే వెళ్ళబోతున్నారని..ఇలా రకరకాల వార్తలు ప్రచారం లో ఉన్నాయి..బ్యాటరీ రీ ఛార్జ్ టాస్కులో రోహిత్ వరుసగా రెండు వారాలు ఇంటి సభ్యుల కోసం నామినెటే అయినా సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ఆయన డేంజర్ల జోన్ లో ఉండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు రావడం తో రోహిత్ ని అభిమానించే వాళ్ళు బాధపడుతున్నారు.

ఇంటి సభ్యుల కోసం రోహిత్ ఇంత త్యాగం చెయ్యాలా అని బాధపడుతున్నారు..ఒకవేళ రోహిత్ ఎలిమినేట్ అయితే ఇంటి సభ్యులు ఎంతలా బాధపడుతారో ఊహించుకోవచ్చు..మెరీనా వెళ్లినా అదే విధంగా బాధపడుతారు..ఎందుకంటే వీళ్ళిద్దరితో ఇంటి సభ్యులందరికి మంచి బాండింగ్ ఏర్పడింది..ప్రస్తుతం శనివారం కి సంబంధించిన బిగ్ బాస్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతూ ఉండి..మరి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు..సోషల్ మీడియా లో వచ్చిన పుకార్ల ప్రకారం డబుల్ ఎలిమినేషన్ ఉందా, లేకపోతే సింగిల్ ఎలిమినేషనా అనేది తెలియాల్సి ఉండి.