https://oktelugu.com/

Shekhar Master: శేఖర్ మాస్టర్ సీక్రెట్ ఎఫైర్స్… హైపర్ ఆది నోరు విప్పడంతో స్టార్ కొరియోగ్రాఫర్ బండారం బయటకు!

Shekhar Master: శేఖర్ మాస్టర్ ఫోన్ రహస్యంగా లేపేసిన ఆది ఆయన యవ్వారం మొత్తం బయటపెట్టాడు. ఈ క్రమంలో హీరోయిన్స్ తో శేఖర్ మాస్టర్ టచ్ ఉన్నట్లు తెలిపాడు. అంతేకాదు భూమిక ఇప్పటికీ టచ్ లోనే ఉందని, ఆమె నుంచి కంటిన్యూగా 69 మిస్డ్ కాల్స్ ఉన్నాయని ఆది చెప్పాడు.

Written By: , Updated On : May 30, 2024 / 07:48 PM IST
Shekhar Master

Shekhar Master

Follow us on

Shekhar Master: శేఖర్ మాస్టర్ ప్రస్తుతం సౌత్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్నారు. ఒక వైపు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా ఉంటూనే మరో వైపు బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ షోలో కొన్నేళ్లుగా  ఆయన జడ్జి గా వ్యవహరిస్తున్నారు.  అయితే శేఖర్ మాస్టర్( Shekhar Master ) పై తరచు ఎఫైర్ రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఆయన బండారం మొత్తం బయటపెట్టాడు హైపర్ ఆది.  
 
శేఖర్ మాస్టర్ ఫోన్ రహస్యంగా లేపేసిన ఆది ఆయన యవ్వారం మొత్తం బయటపెట్టాడు. ఈ క్రమంలో హీరోయిన్స్ తో శేఖర్ మాస్టర్ టచ్ ఉన్నట్లు తెలిపాడు. అంతేకాదు భూమిక ఇప్పటికీ టచ్ లోనే ఉందని, ఆమె నుంచి కంటిన్యూగా 69 మిస్డ్ కాల్స్  ఉన్నాయని ఆది చెప్పాడు. ఏంటి సామీ ఇది అంటూ శేఖర్ మాస్టర్ ని ప్రశ్నించాడు. కానీ శేఖర్ మాస్టర్ సైలెంట్ గా ఉండిపోయారు. మరోవైపు శేఖర్ కాల్ చేసిన డేటా తీశాడు. 
 
 నందిత, ప్రియమణి, పూర్ణ, శ్రద్ధ దాస్,( Shraddha Das ) ప్రణీత లకు ఫోన్ చేశాడట శేఖర్ మాస్టర్. ఇక ఆయన రోజు ఏం చేస్తాడో కూడా ఫోన్ లో ఉందట. 15 మినిట్స్ వాకింగ్, అర్థ గంట ట్రెక్కింగ్,మరో గంట ఇంకేదో ఇంగ్ ఉందని అంటూ..  కాదు డాన్సింగ్ అని చెప్పి కవర్ చేశాడు. ఇలా శేఖర్ మాస్టర్ ఫోన్ లోని సీక్రెట్స్ అన్ని బయట పెట్టాడు ఆది. ఆ తర్వాత డాన్సర్లను కూడా ఆది వదల్లేదు. వాళ్ళ ఫోనులు చెక్ చేసి వాళ్ళకి ఎవరెవరు కాల్ చేస్తున్నారో చెప్పేసాడు. 
 
కానీ చివర్లో హైపర్ ఆదికి, శేఖర్ మాస్టర్ గట్టి షాక్ ఇచ్చాడు.  హైపర్ ఆది ఫోన్ తీసుకున్న శేఖర్ మాస్టర్ అతని గుట్టు రట్టు చేశాడు. ఆది నడిపిన యవ్వారాలు బయటపెట్టాడు. హైపర్ ఆది రసిక రాణితో, జింగిడి జ్యోతికతో చాట్ చేశాడని శేఖర్ మాస్టర్ వెల్లడించారు. ఏమని చాట్ చేశాడో కూడా ఆయన చెప్పేసాడు. దీంతో ఆది వచ్చి ఆయన దగ్గర ఫోన్ లాగేసుకున్నాడు. అయితే కామెడీ కోసం చేసిన ఈ స్కిట్ ఆద్యంతం నవ్వులు పూయించింది.