Mitchell Starc Vs Travis Head: బాబోయ్..స్టార్క్, హెడ్ మధ్య ఇంత జరిగిందా? మైదానం బయటైతే కొట్టుకునే వారేమో?

చెన్నై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా జట్టు హైదరాబాద్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 29, 2024 8:27 am

Mitchell Starc Vs Travis Head

Follow us on

Mitchell Starc Vs Travis Head: ఐపీఎల్ ముగిసినప్పటికీ..కోల్ కతా జట్టు విజేతగా ఆవిర్భవించినప్పటికీ.. ఇంకా ఆసక్తికరమైన విషయాలకు కొదవ లేకుండా పోతోంది. రోజుకో తీరుగా కొత్త అంశం వెలుగులోకి వచ్చి ప్రేక్షకుల బుర్రలను గింగిరాలు తిప్పుతోంది..కోల్ కతా, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి ప్రస్తుతం ఒక సంచలన విషయం మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాకపోతే అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చెన్నై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా జట్టు హైదరాబాద్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోల్ కతా బౌలర్లు మైదానంపై ఉన్న పేస్ ను సద్వినియోగం చేసుకొని హైదరాబాద్ బ్యాటర్ల భరతం పట్టారు. ముఖ్యంగా కోల్ కతా బౌలర్ స్టార్క్ నిప్పులు చెరిగే విధంగా బంతులు వేయడంతో హైదరాబాద్ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 113 పరుగులకే కుప్ప కూలింది. దీంతో కోల్ కతా జట్టు ఆ లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ముచ్చటగా మూడవసారి ఐపీఎల్ ట్రోఫీని సగర్వంగా దక్కించుకుంది.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం ఫైనల్ మ్యాచ్లో స్టార్క్, హెడ్ మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది.. అయితే ఇది మ్యాచ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. సరదాగా జరిగిన ఈ సంఘటన మైదానంలో నవ్వులు పూయించింది. ఫస్ట్ ఓవర్ బౌలింగ్ చేసిన స్టార్క్.. హైదరాబాద్ ఆటగాడు హెడ్ ను మాటలతో కవ్వించాడు..” నీకు దమ్ముంటే స్ట్రైక్ తీసుకో.. నన్ను కాచుకో” అటు సవాల్ విసిరాడు.. దానికి హెడ్ చిరునవ్వుతోనే సమాధానం చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతకుముందు కోల్ కతా, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫైయర్ -1 మ్యాచ్ లో స్టార్క్ హైదరాబాద్ జట్టును వణికించాడు. ఆ మ్యాచ్లో స్టార్క్ వేసిన తొలి బంతికే హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గోల్డెన్ డక్ అవుట్ గా పెవిలియన్ చేరుకున్నాడు.

ఇప్పుడు మాత్రమే కాదు ఆస్ట్రేలియా దేశవాళి క్రికెట్, ఫ్రాంచైజీ క్రికెట్ లోనూ హెడ్ స్టాక్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫైనల్ మ్యాచ్లో తొలి ఓవర్ ను స్టార్క్ వేయగా.. ట్రావిస్ హెడ్ స్ట్రైకింగ్ తీసుకోకుండా.. నాన్ స్ట్రైకింగ్ వైపు నిలబడ్డాడు. అభిషేక్ శర్మ స్ట్రైక్ తీసుకోగా.. తొలి బంతివేసిన స్టార్క్.. తన మాటలతో హెడ్ ను రెచ్చగొట్టాడు.. స్ట్రైక్ తీసుకునేందుకు భయపడ్డావా అంటూ హెచ్చరించాడు.. ఈ సవాల్ కు హెడ్ ఏమీ మాట్లాడలేదు. చిరునవ్వునే సమాధానంగా చెప్పాడు. ఒకవేళ మైదానం బయట ఈ సంఘటన జరిగి ఉంటే.. కచ్చితంగా హెడ్, స్టార్క్ కొట్టుకునే వారేమోనని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు..ఇక స్టార్క్ ను తప్పించుకున్నప్పటికీ వైభవ్ అరోరా బౌలింగ్లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి హెడ్ డక్ అవుట్ అయ్యాడు. అంతకుముందు స్టార్క్ తొలి ఓవర్ లో అభిషేక్ శర్మను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.