Tollywood Heroes in Villain Roles:ప్రస్తుతం పాన్ ఇండియాలో తెలుగు హీరోల హవా ఎక్కువైపోయింది. మన హీరోలు ఏ సినిమాలు చేసినా కూడా ప్రేక్షకులను అలరించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మొత్తం షేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం.ఇక ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీని వెనక్కి నెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇక బాలీవుడ్ హీరోలను సైతం పక్కన పెట్టేసి మన స్టార్ హీరోలు నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు… ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కొంతమంది ఇతర భాషల దర్శకులు, హీరోలు కలిసి మన స్టార్ హీరోలను విలన్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మంచి క్యారెక్టర్స్ అంటూ మనవాళ్ల చేత విలన్ క్యారెక్టర్స్ చేయించి మన హీరోల మార్కెట్ ను కొత్త వరకు తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది… తెలుగులో ఈరోజు రెండు సినిమాలు రిలీజ్ అయినప్పటికి అవి రెండు కూడా ఇతర భాషల సినిమాలే కావడం విశేషం… రజనీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన సినిమా…అలాగే హృతిక్ రోషన్ – ఎన్టీఆర్లు కలిసి చేసిన వార్ 2 సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందింది. అయితే ఈ రెండు సినిమాల్లో కూడా మన తెలుగు హీరోలే విలన్లుగా నటించారు.
Also Read: ‘వార్ 2’ సినిమాకు మేజర్ మైనస్ అదే…
కూలీ సినిమాలో నాగార్జున విలన్ పాత్రని పోషించాడు. సైమన్ గా తను పోషించిన పాత్ర కి 100% న్యాయమైతే చేశాడు. ఇక వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడమే కాకుండా విలనిజాన్ని కూడా చాలా బాగా పండించాడు. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం మన స్టార్ హీరోలందరు నెంబర్ వన్ పొజిషన్ ని అందుకోవాలనే దృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళ్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలో ఇతర భాషల దర్శకులు మాత్రం మన వాళ్ళని విలన్స్ గా చూపించి మన వాళ్లకున్న మార్కెట్ ను తగ్గించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలను చూస్తే మన హీరోలు విలన్లుగా మాత్రమే పనికొస్తారా? హీరోలుగా పని చేయరా అంటూ కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి.
Also Read: ‘కూలీ మూవీ అంత ఒకే కానీ ఈ 2 మైనస్ అయ్యాయా..?
మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట రాబోయే మన స్టార్ హీరోల సినిమాలతో మరోసారి వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకొని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకునే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది…