Surya 44: సూర్య 44 లో మరో స్టార్ హీరో నటిస్తున్నాడా..?

'సూర్య 44' అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మొత్తానికి అయితే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనుల్లో తను బిజీ కానున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : June 22, 2024 8:24 am

Surya 44

Follow us on

Surya 44: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూర్య లాంటి నటుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఇప్పటికీ వరుస విజయాలను అందుకోవడమే కాకుండా అతనితో పాటు తెలుగులో కూడా సక్సెస్ ఫుల్ హీరోగా నిలిపాయి. ఇక ప్రస్తుతం ఈయన శివ దర్శకత్వంలో కంగువ అనే సినిమా చేశాడు.

ఈ సినిమాని దీపావళి కానుకగా రిలీజ్ చేసే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో ‘సూర్య 44’ అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మొత్తానికి అయితే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనుల్లో తను బిజీ కానున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కనక మనం చూసినట్లయితే ఇందులో వింటేజ్ సూర్య మనకి కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య తో పాటు మరొక స్టార్ హీరో కూడా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఆయన ఎవరు అంటే కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్న ‘యశ్ ‘ అని తెలుస్తుంది. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉండడంతో ఆ క్యారెక్టర్ కోసం యశ్ ను తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో తనదే కీలకపాత్ర అనే విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది.

మరి ఆ క్యారెక్టర్ ఎంత సేపు ఉంటుంది అనే దాని మీద సరైన క్లారిటీ లేదు. కానీ ఆ క్యారెక్టర్ ను చేయడానికి యశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి…ఇక కార్తీక్ సుబ్బరాజు సినిమాలో చేస్తే ప్రతి నటుడికి కూడా ఒక వైవిధ్యమైన గుర్తింపైతే వస్తుంది. అందుకే యశ్ ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది…