https://oktelugu.com/

Pradeep Machiraju: ప్రదీప్ మాచిరాజుకు ఆ కుర్ర యాంకర్ అంత నచ్చిందా… బంపర్ ఛాన్స్ ఇచ్చాడుగా!

ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడని... కాదు ఓ సినిమా కోసం షో మానేశాడని పలు రకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ కథనాలపై ప్రదీప్ స్పందించలేదు. మొన్నామధ్య జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ తన న్యూ మేకోవర్ ఫోటోలు షేర్ చేశాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 9, 2024 / 06:35 PM IST

    Pradeep Machiraju

    Follow us on

    Pradeep Machiraju: యాంకర్ ప్రదీప్ మాచిరాజు కొన్నేళ్లుగా బుల్లితెర పై హవా సాగిస్తున్నాడు. ప్రముఖ ఛానల్స్ లో సక్సెస్ఫుల్ షోలు చేశాడు. ప్రదీప్ హోస్ట్ గా చేసే షోలు మంచి టీఆర్పీ రాబట్టేవి. ప్రదీప్ మాదిరి సక్సెస్ అయిన మేల్ యాంకర్స్ గతంలో లేరంటే అతిశయోక్తి కాదు. అయితే కొంతకాలంగా ప్రదీప్ స్మాల్ స్క్రీన్ కి దూరమయ్యారు. ఆయన ఏళ్లుగా యాంకర్ గా వ్యవహరిస్తున్న ఢీ షో నుండి తప్పుకున్నాడు. ప్రదీప్ స్థానంలోకి నటుడు నందు వచ్చాడు. దీంతో ప్రదీప్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

    ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడని… కాదు ఓ సినిమా కోసం షో మానేశాడని పలు రకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ కథనాలపై ప్రదీప్ స్పందించలేదు. మొన్నామధ్య జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ తన న్యూ మేకోవర్ ఫోటోలు షేర్ చేశాడు. దీంతో కొత్త సినిమా కోసమే ఈ మేకోవర్ అని ఫ్యాన్స్ భావించారు. దానికి అనుగుణంగా ప్రదీప్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. మరోసారి ప్రదీప్ హీరోగా రాబోతున్నాడట.

    గతంలో ప్రదీప్ యాంకర్ గా సక్సెస్ అయ్యాక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించి మెప్పించాడు. జులాయి, అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో మెరిశాడు. ‘ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ‘ అనే సినిమా తో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ప్రదీప్ వరుసగా సినిమాలు చేస్తాడు అనుకుంటే .. పూర్తిగా సైలెంట్ అయ్యాడు. యాంకర్ గా కంటిన్యూ అయ్యాడు.

    తిరిగి మూడేళ్ళ తర్వాత హీరోగా రాబోతున్నాడని సమాచారం. ప్రదీప్ హీరోగా ఓ క్రేజీ మూవీ రాబోతుందట. ఇందులో ప్రదీప్ కి జోడిగా దీపికా పిల్లి నటించనుందని సమాచారం. టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ఫేమస్ అయిన దీపికా పిల్లి ఢీ షోలో యాంకర్ గా సందడి చేసింది. ఈ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కింది. వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో దీపికా పదుకొనె ఓ పాత్ర చేసింది. ఈసారి ఏకంగా ప్రదీప్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుందని టాక్. మరి ఇదే నిజమైతే దీపికా పిల్లికి బంపర్ ఆఫర్ దక్కినట్లే. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.