Animal Collections: అనిమల్ ప్రభంజనం 9 రోజులకే అన్ని వందల కోట్లా..? ఇది సందీప్ వంగ సక్సెస్…

సందీప్ రెడ్డి వంగ మరోసారి బాక్సఫిస్ మీద తన పంజాని విసిరాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన సినిమాలకి పాన్ ఇండియా రేంజ్ లో మంచి గిరాకీ పెరిగింది.

Written By: Gopi, Updated On : December 11, 2023 8:35 am

Animal OTT

Follow us on

Animal Collections: సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఇప్పుడు రన్బీర్ కపూర్ ని హీరోగా పెట్టి సందీప్ చేసిన అనిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఈ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటినుంచి ప్రతిరోజు కలక్షన్లు పెరుగుతూనే వస్తున్నాయి. ఇక ఇప్పటికీ 9 రోజులకు ఈ సినిమా 660.89 కోట్ల కలక్షన్స్ ని వసూలు చేసింది. ఒక ఇండియాలోనే 400 కోట్ల కలక్షన్స్ ని వసూలు చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా అలాగే 660.89 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగ మరోసారి బాక్సఫిస్ మీద తన పంజాని విసిరాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన సినిమాలకి పాన్ ఇండియా రేంజ్ లో మంచి గిరాకీ పెరిగింది. ఇక ఇప్పుడు అనిమల్ సినిమాతో మరోసారి తన స్టామిన ఏంటో ప్రూవ్ చేసుకోవడంతో బాలీవుడ్ హీరోలు సైతం సందీప్ రెడ్డి వంగ వెంట పడుతున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన రేంజ్ అనేది ఎంతలా పెరిగిందో…ఇక ఈ సినిమా మార్కెట్ లో ఒక ప్రత్యేకతను చాటుకోవడమే కాకుండా ఇప్పటివరకు ఉన్న ఇండియన్ సినిమాల్లో ఒక కల్ట్ క్లాసికల్ మూవీగా మిగిలి పోయిందనే చెప్పాలి.

ఇక ఈ సినిమా మీద సెలబ్రిటీలు సైతం తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి ఎంతలా నచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఒక మిక్స్ డ్ టాక్ వచ్చిన సినిమా గురించి ఏ సెలబ్రిటీ కూడా పట్టించుకోడు అయిన కూడా అల్లు అర్జున్ లాంటి హీరో ఈ సినిమా మీద ఒక ట్వీట్ ని పెట్టాడు, అలాగే హరీష్ శంకర్ కూడా తన ఒపీనియన్ ని చెప్పాడు. ఇక హీరోలు, డైరెక్టర్లు ఈ సినిమా గురించి ఇలా గొప్ప గా మాట్లాడటం అనేది నిజంగా గ్రేట్…ఇది ఒక తెలుగు వాడు సాదించిన విజయం గా మనం చెప్పుకోవాలి.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 660.89 కోట్లు సంపాదించిందంటే మామూలు విషయం కాదు అది కూడా కేవలం తొమ్మిది రోజుల్లోనే ఈ ఫీట్ ను సాధించింది అంటే ఈ సినిమాకి ఉన్నటు వంటి క్రేజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు…నిజానికి ఈ సినిమాకి ప్రపంచం లో ఉన్న సినిమా అభిమానులందరూ ఫ్యాన్స్ అయిపోయారనే చెప్పాలి…