KTR: తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. బీజేపీ రాష్ర్టంలో బలపడుతున్న క్రమంలో టీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదు. దీంతో ఎలాగైనా తన ప్రభావాన్ని తగ్గించేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు అంశంలో ఢిల్లీ వరకు వెళ్లిన టీఆర్ఎస్ మంత్రులు ఏం తేల్చకుండానే వెనుదిరిగారు. దీంతో బీజేపీపై విమర్శలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తోంది. దీని కోసం అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపడం లేదని నిందిస్తోంది.

ఈ నేపథ్యంలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య వార్ పెరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని అధికారంలోకి రానీయకుండా చేసేందుకే టీఆర్ఎస్ ఆలోచిస్తోంది. ఇప్పటికే దుబ్బాక, హుజురాబాద్ లలో గెలిచి అధికార పార్టీకి సవాలు విసురుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేసింది. ఈ పరిణామాలతో ఖంగుతిన్న టీఆర్ఎస్ ప్రస్తుతం బీజేపీనే ప్రత్యామ్నాయంగా భావిస్తోంది. దీంతోనే దాన్ని అడ్డుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది.
Also Read: అమిత్ షా లూప్ హోల్ పై కొట్టిన కేటీఆర్
ఇటీవల బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో బీజేపీ ప్రతిష్ట మరింత పెరిగింది. అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఇది మింగుడు పడటం లేదు. ఎంత తగ్గించాలని చూస్తున్న అంత పైకి ఎగుస్తున్న బీజేపీని టార్గెట్ చేసుకుని మంత్రి కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు.బీజేపీ విధానాలను ఎండగట్టాలని చూస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఎంత మాత్రం తగ్గేదే లే అంటోంది.
టీఆర్ఎస్ విధానాలను చూపుతూ బీజేపీని కించపరచాలని చూస్తున్నారు. రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టారని ఎద్దేవా చేస్తున్నారు. కేంద్రం విధానాలు సరిగి లేవని దుయ్యబడుతున్నారు. వీటితో బీజేపీని అణగదొక్కాలని ప్రణాళికలు రచిస్తున్నారు కానీ చెరపకురా చెడేవు అనే సామెతను గుర్తుకు తెచ్చుకోవడం లేదు. ఆకాశం మీద ఉమ్మెస్తే మన మీదే పడుతుందనే సామెత కేటీఆర్ కు గుర్తుకు రావడం లేదా అని బీజేపీ నేతలు కూడా సెటైర్లు వేస్తున్నారు.
Also Read: చినజీయర్ స్వామి ఆశ్రమ కార్యక్రమానికి కేసీఆర్ సర్కారు అత్యధిక ప్రాధాన్యత..!