Akhanda 2 First Week Collections: కొన్ని కాంబినేషన్స్ లో తెరకెక్కే సినిమాలు కలలో కూడా ఫ్లాప్ అవుతాయని మనం అనుకోము. కానీ కాలం కలిసిరాక, టాక్ లేకపోవడం వల్ల, అలాంటి కాంబినేషన్స్ కూడా చతికిల పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. లేటెస్ట్ గా విడుదలైన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం ఆ కోవకు చెందిన సినిమానే. బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో వచ్చిన నాల్గవ సినిమా ఇది. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూడు సినిమాలు ఒకదానిని మించి ఒకటి హిట్ అవుతూ వచ్చాయి. ముఖ్యంగా అఖండ చిత్రమైతే బాలయ్య కెరీర్ ని సరికొత్త మలుపు తిప్పింది. అప్పటి నుండి ‘డాకు మహారాజ్’ వరకు ఫ్లాప్ అనే పదానికి అర్థం కూడా తెలియదు అన్నట్టుగా బాలయ్య దూసుకెళ్లాడు. అలా దూసుకెళ్తున్న బాలయ్య కి ‘అఖండ 2’ చిత్రం పెద్ద బ్రేక్ వేసింది. వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో చూద్దాం.
నైజాం ప్రాంతం లో మొదటి వారం ఈ చిత్రానికి 16 కోట్ల 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో మూడు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి ఈ చిత్రం మొదటి వారం లో 10 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో పది కోట్ల షేర్ ని రాబట్టాలి. ఉత్తరాంధ్ర ప్రాంతం లో మొదటి వారం 4 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, తూర్పు గోదావరి జిల్లా నుండి 3 కోట్ల 78 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 2 కోట్ల 82 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 5 కోట్లు, కృష్ణా జిల్లా నుండి 3 కోట్ల 29 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక నెల్లూరు జిల్లాలో అయితే మొదటి వారం 2 కోట్ల 47 లక్షల రూపాయల షేర్ వసూలు వచ్చాయి.
ఓవరాల్ గా ఈ చిత్రం మొదటి వారం 49 కోట్ల 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇదంతా రిటర్న్ జీఎస్టీ కలుపుకునే అనే చెప్పొచ్చు. ఇక రెస్ట్ అఫ్ ఇండియా విషయానికి వస్తే కర్ణాటక నుండి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, ఓవర్సీస్ నుండి కేవలం 4 కోట్ల 62 లక్షలు మాత్రమే వచ్చింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తగా ఈ చిత్రానికి 60 కోట్ల 23 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మరో 44 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కేవలం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం కోసం రావాలి. అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పొచ్చు.