Narasimhaa Re-release Collections: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) కెరీర్ లో మైలు రాయి లాంటి చిత్రం ‘పడయప్పా’. తెలుగు లో ఈ చిత్రాన్ని ‘నరసింహా'(Narasimhaa Movie) అనే పేరుతో విడుదల చేశారు. తమిళం లో ఈ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో, తెలుగు లో కూడా అంతే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆరోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా సృష్టించిన సునామీ ఎలాంటిది అనేది. ఇండియా లో ఏ స్టార్ హీరో సూపర్ హిట్ సినిమా కూడా ‘పడయప్పా’ కి దరిదాపుల్లో కూడా లేదు. ఇకపోతే ఈ చిత్రం పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రీసెంట్ గానే 4K కి రీ మాస్టర్ చేయించి గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. ఈ రీ రిలీజ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ సినిమాకు మొదటి వారం లో తమిళనాడు వ్యాప్తంగా 9 కోట్ల 26 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఆల్ టైం టాప్ 2 గ్రాసర్ గా నిల్చింది అట. మొదటి స్థానం లో విజయ్ నటించిన ‘గిల్లీ’ రీ రిలీజ్ పది కోట్ల రూపాయిల గ్రాస్ తో కొనసాగుతుంది. మొదటి రోజున ఈ చిత్రానికి 2 కోట్ల 27 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత రెండవ రోజున 2 కోట్ల 13 లక్షణాలు రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, మూడవ రోజు 2 కోట్ల 7 లక్షల రూపాయిలు , నాల్గవ రోజున 69 లక్షలు , ఐదవ రోజు కూడా అదే స్థాయి వసూళ్లు, ఆరవ రోజున 74 లక్షలు, 7 వ రోజున 64 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తమిళనాడు లో మొదటి వారం ఈ చిత్రానికి 9 కోట్ల 26 లక్షల 43 వేల రూపాయిలు వచ్చాయి.
ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. మరి ఈ చిత్రం ‘గిల్లీ’ ఫుల్ రన్ రికార్డు 50 కోట్ల గ్రాస్ రికార్డు ని బద్దలు కొడుతుందో లేదో చూడాలి. తెలుగు లో కూడా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసుంటే బాగుండేది అని అంటున్నారు నెటిజెన్స్. ఇక్కడ కూడా ఈ రీ రిలీజ్ కి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టి ఉండేవారని, మంచి ఛాన్స్ మిస్ చేసారని అంటున్నారు.