Bhartha Mahasayulaku Vignapthi Teaser Review: ‘ధమాకా’ చిత్రం తర్వాత వరుసగా 6 డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను అందుకున్న రవితేజ(Mass Maharaja Raviteja), రీసెంట్ గానే ‘మాస్ జాతర’ చిత్రం తో మరో డిజాస్టర్ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. రవితేజ ని జనాలు స్టార్ హీరో తో సమానంగా చూస్తారు కాబట్టి, ఆయన ఎన్ని ఫ్లాప్ సినిమాలు తీసినా, మొదటి రోజు మినిమం గ్యారంటీ ఓపెనింగ్స్ ని ఇస్తున్నారు ఆడియన్స్. కానీ ఇంకొక్క ఫ్లాప్ తగిలితే మాత్రం ఆ ఓపెనింగ్స్ కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే ఇకపై చేసే సినిమాలకు మినుముమ్ గ్యారంటీ దర్శకులు ఉండేలా చూసుకుంటున్నాడు. అందులో భాగంగా ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘చిత్రలహరి’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన కిషోర్ తిరుమల దర్శకత్వం లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bharta Mahasayulaku Vignapti) అనే చిత్రం చేసాడు రవితేజ. ఇందులో హీరోయిన్స్ లో ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి నటించారు.
ఇద్దరి ఆడవాళ్ళ మధ్య నలిగిపోయే భర్త క్యారెక్టర్ లో రవితేజ ఇందులో కనిపించబోతున్నాడు. రొటీన్ స్టోరీ లైన్, కానీ స్క్రీన్ ప్లే వినోదాత్మకంగా ఉంటే కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. అందుకే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13 న విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ ని చూస్తుంటే ఈ చిత్రం లో ఉండాల్సిన టాప్ నటీనటులంతా ఉన్నారు. వెన్నెల కిషోర్,సునీల్, సత్య ఇలా ఎంతో మంది కమెడియన్స్ ఉన్నారు. కానీ టీజర్ చూస్తున్నంత సేపు ఒక్క సందర్భంలో కూడా నవ్వు రాలేదు. రొటీన్ స్టోరీ లైన్ సినిమా అని తెలిసినప్పుడు కామెడీ ట్రాక్ వేరే లెవెల్ లో ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ చిత్రం లో అదే మిస్ అయ్యినట్టుగా అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
‘రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ లాంటి భారీ సినిమాలు సంక్రాంతి రేస్ లో ఉన్నాయి. ఇలాంటి సమయం లో రవితేజ రావడం అవసరమా?, అంటే ఈ సినిమాని సంక్రాంతికి తప్ప, ఎప్పుడు విడుదల చేసినా డిజాస్టర్ అయిపోతుందని తప్పనిసరి పరిస్థితిలో సంక్రాంతికి విడుదల చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇలా టీజర్స్ చూసినప్పుడు పెద్దగా ఏమి అనిపించకపోవడం, కానీ సినిమా ని చూసి థ్రిల్ కి గురి కావడం వంటివి గతం లో చాలానే జరిగాయి. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం కూడా ఆ కోవకు చెందిన సినిమా అయ్యుండొచ్చు కదా?, ఒకవేళ కామెడీ వర్కౌట్ అయితే రవితేజ కి కావాల్సిన భారీ బ్లాక్ బస్టర్ హిట్ దొరికినట్టే అనుకోవచ్చు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.