Mahesh Babu And Rajamouli: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఉన్నప్పటికీ రాజమౌళికి ఉన్న ప్రత్యేకత ఇంకేవరికి లేదని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక అందులో భాగంగానే ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన రికార్డుని క్రియేట్ చేసుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో మహేష్ బాబు తన 29వ సినిమా(ఎస్ఎస్ఎమ్ బి29) కోసం రాజమౌళితో జతకడుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఇలాంటి నేపథ్యంలో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా సెట్స్ మీదికి ఎప్పుడు వెళ్తుంది అనే దానిమీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ప్రస్తుతం జక్కన్న ఈ సినిమా కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. అలాగే ఆర్టిస్టులను ఫైనల్ చేసే పనిలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమా గా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి ఈ సినిమాలో తీసుకునే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఈ సినిమాకు న్యాయం చేసే వాళ్లు కావాలనే ఉద్దేశ్యం తోనే ఈ సినిమాలో నటించే నటీనటుల కోసం చాలా సెర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరుపొందిన అమీర్ ఖాన్ ని, మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్ర కోసం తీసుకోబోతున్నారు అనే వార్తలు గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక అమీర్ ఖాన్ కూడా ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక్క సినిమాకి కూడా కమిట్ అవ్వలేదు. దానికి కారణం ఏంటి అంటే లాల్ సింగ్ చద్దా ఫ్లాప్ తర్వాత ఇప్పుడు చేయబోయే సినిమా సూపర్ సక్సెస్ అయితేనే తన మార్కెట్ అనేది పదిలంగా ఉంటుంది. లేకపోతే మాత్రం మార్కెట్ మీద భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్ది రోజులు గ్యాప్ తీసుకొనైన ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్ర కోసం రాజమౌళి అమీర్ ఖాన్ ను కలిసి ఆయనకి ఈ సినిమా స్టోరీ ని చెప్పి తనని ఈ మూవీ లోకి తీసుకోబోతున్నారు అంటూ పలు రకాల వార్తలైతే వస్తున్నాయి.
ఇక గత కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరూ సీక్రెట్ గా ఒక హోటల్లో కలిసినట్టు ఒక ప్రముఖ మీడియా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. ఇక ఇది ఇక ఉంటే దీని మీద అమీర్ ఖాన్ గాని, రాజమౌళి గాని ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి రాజమౌళి మహేష్ బాబుతో చేసే సినిమాలో అమీర్ ఖాన్ ఉంటాడా లేదా అనే విషయం తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…