https://oktelugu.com/

Pushpa 2 Teaser: పుష్ప 2 టీజర్ ను ‘హెచ్ డి అర్ ‘ లో రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటంటే..?

ప్రేక్షకుల్లో ఒక డెప్త్ ఫీల్ ని తీసుకురావడం కోసమే ఇలాంటి ఒక ఫార్మాట్ లో ఈ టీజర్ ని రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకు ముందు దేవర, జవాన్, కంగువ లాంటి సినిమా టీజర్ లని కూడా ఈ ఫార్మాట్ లోనే రిలీజ్ చేశారు.

Written By:
  • Gopi
  • , Updated On : April 9, 2024 / 02:36 PM IST

    Pushpa 2 Teaser

    Follow us on

    Pushpa 2 Teaser: సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న “పుష్ప 2” సినిమా మీద ఇండియాలో భారీ అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా మీద ఇంతలా అంచనాలు పెరగడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే గత మూడు సంవత్సరాల క్రితం పుష్ప సినిమాతో ఈ కాంబినేషన్ ఒక ప్రభంజనాన్ని సృష్టించిందనే చెప్పాలి. ఇక దానికి తగ్గట్టుగా ఇప్పుడు రాబోతున్న పుష్ప 2 సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందనే నమ్మకంతో సినిమా యూనిట్ అయితే ఉంది.

    ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ ని ‘హెచ్ డీ ఆర్’ ఫార్మాట్ లో రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే హెచ్ డి ఆర్ అంటే ‘హై డైనమిక్ రేంజ్’ దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనకు కనిపించే ప్రతి కలర్ చాలా డెప్త్ గా కనిపిస్తుంది. అంటే వైట్ చాలా వైట్ గా, రెడ్ ఇంకా రెడ్ గా, గ్రీన్ మరింత గ్రీన్ గా కనిపిస్తుంది. ఇక దీనివల్ల ప్రేక్షకుడికి అదంతా న్యాచురల్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది.

    అలా ప్రేక్షకుల్లో ఒక డెప్త్ ఫీల్ ని తీసుకురావడం కోసమే ఇలాంటి ఒక ఫార్మాట్ లో ఈ టీజర్ ని రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకు ముందు దేవర, జవాన్, కంగువ లాంటి సినిమా టీజర్ లని కూడా ఈ ఫార్మాట్ లోనే రిలీజ్ చేశారు. అవి కూడా ప్రేక్షకుడి లో మంచి ఇంపాక్ట్ ను అయితే క్రియేట్ చేశాయి. కాబట్టి ఈ సినిమా కోసం కూడా ఇదే ఫార్మాట్ ని వాడారు.

    ఇక నిన్న రిలీజ్ అయిన టీజర్ ను కనక మనం చూసుకున్నట్లైతే ప్రతి కలర్ కూడా చాలా డెప్త్ గా కనిపిస్తుంది. ఇక మొత్తానికైతే సుకుమార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఒక భారీ ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…