Aadipurush – Bro Movie : ఇండియా మొత్తం ఇప్పుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. శ్రీరాముని చరిత్ర వెండితెర పై ఎన్ని సార్లు ఆవిష్కరించినా చూసేందుకు సిద్ధం గా ఉండే ఆడియన్స్, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ ని పెట్టి అత్యాధునిక టెక్నాలజీ తో తెరకెక్కించి తీస్తే ఎలాంటి అంచనాలు ఉంటాయో, అలాంటి అంచనాలు ఉన్నాయి ఈ సినిమా మీద.
దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ కూడా అద్భుతంగా ఉండడం తో ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం మేకు లాగ తయారు అయ్యింది. ఎందుకంటే ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ రైట్స్ మొత్తాన్ని 180 కోట్ల రూపాయలకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ కొనుగోలు చేసింది.
ఇదే సంస్థ లో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ‘బ్రో ది అవతార్’ అనే చిత్రం కూడా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియోస్ ని రీసెంట్ గానే విడుదల చేసింది మూవీ టీం. వచ్చే నెల 28 వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వచ్చే నెలలో విడుదల పెట్టుకొని ఆశించిన స్థాయిలో ప్రొమోషన్స్ చెయ్యడం లేదని అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యలేదు. ఫ్యాన్స్ టీజర్ కోసం ప్రతీ రోజు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ని ట్యాగ్ చేసి అడుగుతూనే ఉన్నారు.
కానీ టీజర్ గురించి ఎలాంటి అప్డేట్ కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇవ్వడం లేదు. మరోపక్క ఇప్పుడు ఆదిపురుష్ చిత్రాన్ని కూడా కొనుగోలు చేసారు కాబట్టి, ఆ చిత్రం విడుదల అయ్యే వరకు ‘బ్రో ది అవతార్’ టీజర్ వచ్చే సమస్యే లేదని లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్. దీనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా సాక్షిగా అసహనం వ్యక్త పరుస్తున్నారు.