Ravi Teja New Movie: ప్రతీ స్టార్ హీరో అభిమాని తమకు రెండవ ఫేవరెట్ హీరో గా కొంతమంది హీరోస్ ఉంటారు. అలాంటి హీరోస్ లో ఒకరు మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja). ఆయన్ని ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఒకప్పుడు రవితేజ చేసిన సినిమాలు చూస్తే ఎలాంటి మనిషి అయినా ఆయనకు అభిమాని అవ్వాల్సిందే. ప్రతీ ఏడాది రవితేజ నుండి విడుదలయ్యే సినిమాల్లో కనీసం రెండు సూపర్ హిట్స్ అయినా ఉండేవి. అంతటి మినిమం గ్యారంటీ హీరో ఆయన. కానీ ప్రస్తుత జనరేషన్ లో రవితేజ మార్కెట్ దారుణంగా పడిపోయింది. నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోలు కూడా కొత్త తరహా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకుపోతుంటే, రవితేజ మాత్రం కేవలం మాస్ కమర్షియల్ సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియా లో రవితేజ పై ఎలాంటి జోకులు నడుస్తున్నాయంటే, రవితేజ కథలను విని సినిమాలు ఒప్పుకోవడం లేదు, కేవలం హీరోయిన్స్ ని చూసి సినిమాలు ఒప్పుకుంటున్నాడు అనే రేంజ్ ట్రోల్స్ నడుస్తున్నాయి.
ఆయన చేస్తున్న సినిమాలను చూస్తే మనకి కూడా ఒక్క క్షణం నిజమే కదా అని అనిపించక తప్పదు. కానీ రవితేజ పాత సినిమాలను చూస్ ఎలాంటి హీరో, ఎలా అయిపోయాడు అనే బాధ వెంటనే వచ్చేస్తోంది. రీసెంట్ గానే ఆయన నుండి విడుదలైన ‘మాస్ జాతర’ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రవితేజ లో మార్పు వచ్చింది. ఆయన ఎంచుకున్న సినిమాలు మినిమం గ్యారంటీ రేంజ్ లో ఉన్నాయి. ఇక ట్రాక్ లోకి వచ్చేసినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ఆయన ట్రాక్ మార్చలేదు. రీసెంట్ గానే ఆయన ఒక సినిమాని ఒప్పుకున్నాడట. అందులో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 6 మంది హీరోయిన్లు ఉంటారట.
ఈ చిత్రానికి ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నాడని, ఆ 6 మంది హీరోయిన్స్ కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ హిట్స్ ని అందుకొని మంచి ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్స్ అని అంటున్నారు. ఈ వార్త సోషల్ మీడియా లో లీక్ అయ్యినప్పటి నుండి రవితేజ పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అయితే ఇది కావాలని రవితేజ మీద పగతో కొంతమంది పుట్టించిన పుకారు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని రవితేజ ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వం లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే చిత్రం చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గానే విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి మంచి రెస్పాన్స్ వచ్చింది.